TS : జైల్లో కవితను కలిసిన బాల్క సుమన్‌, ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌

  • Written By:
  • Publish Date - May 17, 2024 / 03:44 PM IST

Brs Mlc Kavitha: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్టయి ప్రస్తుతం జ్యూడీషియల్‌ కస్టడి(Judicial Custody)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌(Balka Suman), నాగర్‌ కర్నూలు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమర్‌(RS Praveen Kumar) తీహార్‌ జైల్లో కవిత(Kavitha)ను కలిసి ఆమెను పరామర్శించారు. కవితతో ములాఖత్‌ ముగిసిన అనంతరం బాల్క సుమన్‌తో కలిసి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడూతూ..కవిత చాలా ధైర్యంగా ఉన్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఆమె ఉన్నట్లు పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. లాయర్‌కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తాయి. అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు. కవిత దగ్గర ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు. పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుంది? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.

Read Also: BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?

లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. వాళ్ళ పేర్లు, వీళ్లా పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీలో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్‌గా ఈడీ వ్యవహరిస్తోంది. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీని బీజేపీ వాడుకుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.