Site icon HashtagU Telugu

Babydoll Archi AKA Archita : వైరల్ గా మారిన అర్చితా ఫుకాన్ ‘రెడ్ లైట్ ‘ కథ

Archita Phukan

Archita Phukan

ఈ ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతో శక్తివంతమైన వేదికగా మారింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లోనే వైరల్ కావడం, ప్రజల్లో చర్చకు లోనవడం సాధారణమైంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు అర్చితా ఫుకాన్, అస్సాంలోని యువ ఇన్‌ఫ్లూయెన్సర్. ‘బేబీడాల్ అర్చి’ (Babydoll Archi AKA Archita) పేరుతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అర్చితా (Archita Phukan), ఇటీవల తన గతాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. గత 6 సంవత్సరాలుగా ట్రాంక్ రోడ్డులోని రెడ్ లైట్ ఏరియాలో వేశ్యగా జీవనం గడిపినట్లు, ఇటీవల 25 లక్షల రూపాయలు చెల్లించి ఆ జీవితానికీ ముగింపు పలికినట్లు వెల్లడించింది.

Godavari Flow : ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత.. లంక గ్రామాలు నీట మునక

ఈ దారుణ పరిస్థితి నుండి బయటపడి, కొత్త జీవితం ప్రారంభించిన ఆమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా తనతో పాటు ఉన్న 8 మంది మహిళలను కూడా రక్షించిందని చెప్పడం ఆమెను మరింతగా ప్రజల గుండెల్లో నిలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న అర్చితా ఫ్యాషన్, స్టైల్, లైఫ్‌స్టైల్ రీల్స్‌ ద్వారా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల ఆమె ఓ వయోజన తారతో ఉన్న ఫోటోను షేర్ చేయడం, ఇకపై ఆమెతో కలిసి పని చేయబోతున్నానని సూచించడమే ఆమెపై కొత్త చర్చలకు దారితీసింది. ఫలితంగా ఆమె పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ ప్రచారాలపై అర్చితా ఫుకాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. “నా పేరు ప్రచారంలోకి రావడం చూశాను. ఒక్క ఫ్రేమ్, ఒక్క క్షణం వల్లే ఎన్నో ఊహాగానాలు, విమర్శలు రావడం బాధాకరం. నేను వైరల్ అవుతున్న వార్తల్ని నిర్ధారించలేదు, నిరాకరించడానికీ లేదు. కానీ అన్నీ మాటల్లో చెప్పలేను… అనుభవాలే మాకు పాఠాలు నేర్పుతాయి” అంటూ హితవు పలికింది. ఆమె స్పందన మరింత చర్చనీయాంశమవుతోంది. ఒక దారుణమైన జీవితాన్నుంచి వెలికి వచ్చిన ఆమెకు నెటిజన్లు అభినందనలు తెలుపుతూ, ఆమెకు కొత్త జీవితంలో విజయాలు అందాలని ఆకాంక్షిస్తున్నారు.