లాట్స్ ఆఫ్ లవ్ : పిల్ల ఏనుగును కాపాడిన ఆఫీసర్.. శభాష్ అంటున్న నెటిజన్స్!

మీరు అరణ్య సినిమా చూశారా.. అందులో హీరో రానా ప్రకృతి, జంతవులను రక్షిస్తూ గొప్ప పర్యావరణ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. ‘‘జంతువులను కాపాడకపోతే ప్రకృతి నాశనమవుతుంది. బాలెన్స్ కూడా తప్పుతుంది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:38 PM IST

మీరు అరణ్య సినిమా చూశారా.. అందులో హీరో రానా ప్రకృతి, జంతవులను రక్షిస్తూ గొప్ప పర్యావరణ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. ‘‘జంతువులను కాపాడకపోతే ప్రకృతి నాశనమవుతుంది. బాలెన్స్ కూడా తప్పుతుంది. చివరికి మనిషి మనుగడ కూడా సాధ్యం కాదు’’ లాంటి అద్భుతమైన మెసేజ్ ఇస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా..? ఆరణ్య సినిమాలో హీరో రానా ఎనుగులను కాపాడినట్టే.. నిజజీవితంలో ఓ పోలీస్ అధికారి ఓ ఎనుగు పిల్లను కాపాడి సోషల్ మీడియాలో రియల్ హీరోగా నిలిచాడు.

 

తమిళనాడులోని దట్టమైన అడవిలో ఓ ఏనుగు పిల్ల దారి తప్పిపోయింది. తల్లి జాడ కోసం తిరుగుతుండగా గాయపడింది. విషయం తెలసుకున్న అటవీశాఖాధికారులు గాయపడిన ఏనుగు పిల్లను కాపాడి ట్రీట్ మెంట్ ఇస్తారు. ఆ తర్వాత తల్లి ఏనుగు దగ్గరకు చేర్చుతారు. ఈ క్రమంలో తనను కాపాడిన ఓ ఫారెస్ట్ అధికారిని పిల్ల ఏనుగును కౌగిలించుకుంటుంది. తొండంతో ప్రేమగా చుట్టేసుకుంటుంది. ఈ ఘటనతో జంతువులకు ప్రేమాభిమానాలు ఉంటాయని మారోసారి రుజువు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ఓ ఫారెస్ట్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వేలకొద్ది లైక్స్ పడ్డాయి. అధికారిని కౌగిలించుకున్న ఫొటో విపరీతంగా షేర్ అయ్యింది. 11,000 లైక్స్ తో వైరల్ గా మారింది. ‘ప్రేమ కు భాషలేదు’ అంటూ నెటిజన్ల్స్ లైక్స్ వర్షం కురిపించారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేసి, అధికారి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.