Site icon HashtagU Telugu

Vegetarian Crocodile Death: వెజిటేరియన్ మొసలు మృతి.. భక్తుల కంటతడి!

Crocodile

Crocodile

సాధారణంగా మొసలి అంటే చాలామందికి భయం. దానికి మనుషులైనా, ఇతర జంతువులు అయినా ఒక్కటే. కానీ కేరళలోని ఓ ఆలయ చెరువులో ఉండే మొసలి మాత్రం ఎవరిపై దాడి చేయదు. కనీసం చెరువులోని చేపలపై కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ప్యూర్ వెజిటేరియన్. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని అనంతపుర అనే చిన్న గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి చెరువులో నివసించిన బబియా అనే మొసలి అక్టోబర్ 9న మరణించింది. బబియా దాదాపు 75 సంవత్సరాలు టెంపుల్ చెరువులో నివసించింది. ‘శాఖాహారం’ మొసలి. బాబియా మృతితో ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. “మేం పేరు పెట్టి పిలిచినప్పుడు మాకు చాలాసార్లు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మేం ఆహరం అందిస్తున్న తీసుకోవడం లేదు. ఫుడ్ కోసం బయటకు రాలేదు. ఆదివారం చనిపోయి కనిపించింది ”అని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. బబియా మృతిపై ఇంతకుముందు కూడా పుకార్లు వచ్చినప్పటికీ అది ఫేక్ అని తేలింది. మొసలి మరణంతో భక్తుల కంటతడి పెట్టుకున్నారు.

ఈ ఆలయాన్ని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి మూలస్థానం, మూలస్థానం అని పిలుస్తారు. బబియా పద్మనాభన్ దూత అని నివాసితులు నమ్ముతారు. ఇంతకుముందు ఆలయ అధికారులు బాబియాకు రోజుకు రెండుసార్లు ఆలయ ప్రసాదం తినిపించారట. ఆలయ సిబ్బంది చంద్రప్రకాష్‌ ఉదయం, మధ్యాహ్నం బబియాకు భోజనం పెట్టేవారు. దానికి ప్రతిరోజూ 1 కిలోల బియ్యం తినిపిస్తారట. సరస్సులోని చేపలపై కూడా దాడి చేయదు”అని చంద్ర ప్రకాష్ చెప్పారు. ఆలయ పూజారులు బాబియా దాడికి భయపడకుండా సరస్సులో స్నానం చేస్తారని చెప్పారు.