Baba Ramdev: రూ.4 లక్షలు పెట్టి ఆవును కొన్న బాబా రామ్ దేవ్.. అంత ప్రత్యేకత ఏంటంటే?

సాధారణంగా ఆవులతో పోల్చుకుంటే గేదెల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆవుతో ధర 40 వేల లోపు గా ఉంటే, గేదె ధర

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 07:30 AM IST

Baba Ramdev: సాధారణంగా ఆవులతో పోల్చుకుంటే గేదెల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆవుల ధర 40 వేల లోపు ఉంటే, గేదె ధర మాత్రం 40 వేల నుంచి రెండు లక్షలు లేదా మూడు లక్షలు వరకు కూడా ఉంటుంది. చాలామంది ఆవు పాలలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా మరి అటువంటి ఆవు ఎక్కువ ధర ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆవు పాలను చాలామంది తాగడానికి నిరాకరిస్తూ ఉనారు. అవి చూడటానికి కాస్త పసుపు రంగులో కనిపించడం వల్ల ఆ పాలను ఏంటో అనుకొని చాలామంది తాగడానికి వెనకాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆవు మాత్రమే కాకుండా ఆవు పాలు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తూ ఉంటాయి.

కానీ గేదె, గేదె పాలు రెండు కూడా ఎక్కువ ధరలో ఉంటాయి. ఆవు పాలు లీటర్ 30 నుంచి 40 రూపాయలు అమ్ముతుండగా గేదె పాలు మాత్రం 40 నుంచి 70 రూపాయల వరకు కూడా అమ్ముతూ ఉంటారు. కాగా కొన్ని కొన్ని సార్లు ఆవులు కూడా అత్యధిక ధరలను పలుకుతూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఆవు ఏకంగా రూ.4.10 లక్షలకు అమ్ముడుపోయి అందరి చేత ఔరా అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలో మనకు ఎక్కువగా పుంగనూరు జాతి ఆవులు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఈ పుంగనూరు జాతి ఆవు కళ్ళు చెదిరే ధరను పలికింది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒక పశుపోషకుడు దగ్గర ఉన్న ఆవు ఏకంగా రూ.4.10 లక్షలకు అమ్ముడు పోయింది. ఈ ఆవును ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, ఈ గోవును కొనుగోలు చేశారు. మూడున్నర సంవత్సరాల వయసున్న ఈ ఆవు ఎత్తు 30 అంగుళాలు మాత్రమే ఉంది. హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమం నుంచి తెనాలి వచ్చిన ప్రతినిధులు పశుపోషకుడు కంచర్ల శివకుమార్‌ను కలిసి ఆవును కొనుగోలు చేశారు. అంతకుముందు దానికి పశువైద్యాధికారి నాగిరెడ్డి వద్ద పరీక్షలు చేయించారు. అనంతరం దానిని వారు తీసుకెళ్లారు. ప్రత్యేకమైన ఈ జాతి పెంపకానికి అనువుగా ఉంటుందని బాబా రాందేవ్ ఆశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ ఈ ఆవు ధర లక్షల్లో పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.