Site icon HashtagU Telugu

Avoid In Morning: ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులు చూశారో.. ఇక అంతే సంగతులు?

Morning Tips

Morning Tips

చాలా మంది ఉదయం లేవగానే కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. అయితే ఆ విధంగా చేయడం వల్ల వారి మనస్సు పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఏ పని కూడా సక్రమంగా జరుగదు. కొన్ని కొన్ని సార్లు మనకు సంబంధం లేని విషయాల వల్ల కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఉదయం నిద్రలేవగానే భగవంతుని నామాన్ని జపించాలని పండితులు, పెద్దలు చెబుతుంటారు. అలా పెద్దలు చెప్పిన విధంగా చేయడం ద్వారా రోజంతా సానుకూల ప్రభావం చూపుతుందంటారు. ఇక ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులను చూడకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలా మంది ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. అలా లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. దాని ప్రభావం వ్యక్తి యొక్క ఆలోచనలలో పడి వ్యక్తులు తాము చేపట్టిన పనులు ఏవీ కూడా సరిగా జరగవు. అలాగే ఉదయం లేవగానే వంటింట్లో ఉన్న అంట్ల గిన్నెలను చూడకూడదు. ఆడ ఉదయం లేవగానే తిన్న ఆ ఎంగిలి పాత్రలు చూడటం వల్ల ఆ ప్రభావం మీరు చేసే పనులపై చూపుతుంది. ఉదయం లేచిన తర్వాత నిలిచిపోయిన గడియారాన్ని కూడా చూడకూడదు.

అలా చేస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట. అంతేకాకుండా లేనిపోని గొడవలు కూడా జరుగుతాయట. అలాగే ఇంకా సూది,దారం లాంటివి కూడా చూడకూడదు. అలాగే చాలామంది ఉదయం లేవగానే జంతువుల ఫోటోలను చూస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు, గందరగోళాలతో గడిచిపోతుందట. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుంది. లేదా ఏదైనా దేవుడి ఫోటోని చూడడం కూడా మేలు.