Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 8 మంగళవారం రాశి ఫలితాలు.. ఆ రాశిలోని పొలిటికల్ లీడర్లకు బ్యాడ్ టైం

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశిలోని ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండును. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పనులలో ఒత్తిళ్ళు ఉన్నప్పటికి.. మీరు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  శ్రీఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది.

వృషభ రాశి

ఈరోజు వృషభరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.  ఎందుకంటే ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మిథునం

ఈరోజు మిథునరాశిలోని వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు.  ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే పనులు అనుకున్న విధంగా పూర్తి  చేస్తారు. విద్యార్థులకు శ్రమ అధికం.  శుభవార్త వింటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నేశ్వరుని పూజించాలి. శివుడిని ఆరాధించాలి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం లేదు.  వ్యాపారస్తులకు అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది.  ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. రుణ విమోచన కోసం అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి.

సింహం

ఈరోజు సింహరాశిలోని రాజకీయ నాయకులకు చెడు సమయం.  స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబములో చికాకులు, మానసిక సమస్యలు కలుగుతాయి.  అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక  ముఖ్యమైన విషయంలో ఆశించిన  పురోగతి లభిస్తుంది.  గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది.

Also read : Storage of Rice and pulses : బియ్యం, పప్పుదినుసులు పురుగు పట్టకుండా ఉండడానికి చిట్కాలు..

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశిలోని వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి.  మీ పనులకు గుర్తింపు లభిస్తుంది.  కొత్త పనులను ప్రారంభించే ముందు మంచీ చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. ఉన్నతమైన పదవులలో ఉన్నవారిని కలుస్తారు. దైవ బలం రక్షిస్తోంది. అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తుల

ఈరోజు తులారాశి వారు ప్రతి పనిలో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు అనుకూలం. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. అధికారులకు దూరంగా ఉండటమే మంచిది. విఘ్నేశ్వరుని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశి వారికి శత్రువర్గం వల్ల చికాకులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం.  కొత్త పనులను ప్రారంభిస్తారు. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.  ప్రతీ విషయాన్ని లోతుగా పరిశీలించాలని సూచన. దుర్గాదేవిని పూజించండి.

ధనుస్సు

ఈరోజు ధనూరాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలం. వ్యాపారస్తులకు సమస్యలు అధికముగా ఉన్నాయి. కుటుంబ సభ్యులకు ఆరోగ్య విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి.  కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. శివ స్తోత్రం చదివితే మంచిది.

Also read : custard apple health benefits: వామ్మో.. సీతాఫలం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?

మకరం

ఈరోజు మకర రాశి వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచన. మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. నూతన వస్తువులను కొంటారు.  విద్యార్థులకు కఠిన సమయం.  మీ శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కుంభం

ఈరోజు కుంభరాశి వారికి శత్రువర్గం నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు కఠిన సమయం. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.  కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. శివారాధన శుభప్రదం.

మీనం 

ఈరోజు మీన రాశిలోని వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి.  కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయములు కలుగుతాయి.  ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.  దుర్గాదేవిని పూజించండి. చంద్రధ్యానం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.