Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 7 సోమవారం రాశి ఫలితాలు.. వీరికి ఒత్తిళ్లు అధికం

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశిలోని ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఒత్తిళ్ళు అధికము. ఏ పనినైనా కంగారు పడకుండా ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నించాలని సూచన. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు.    శివాష్టకం పఠించడం మంచిది.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి అనుకోని ఖర్చులు ఇబ్బంది కలిగించును. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఈరోజు మిథునరాశిలోని ఉద్యోగస్తులు అధికారుల మన్నన పొందెదరు. వ్యాపారస్తులకు లాభదాయకం.  శుభవార్తలు వింటారు. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి. ఆదిత్యహృదయం  పఠించడం మంచిది.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారికి పని ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఏర్పడుతాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే  బాగుంటుంది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహం

ఈరోజు సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఎన్ని ఇబ్బందులు కలిగినా భాగ్యములో గురు, చంద్రుల అనుకూల స్థితి వల్ల అనుకున్న పనులు పూర్తి  చేస్తారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు.  వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

Also read : Worlds Largest Lock-Ayodhya : 400 కిలోల తాళం.. అయోధ్య రామ మందిరానికి గిఫ్టుగా ఇవ్వనున్న కళాకారుడు

కన్య(Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి ఖర్చులు పెరుగుతాయి.  వ్యాపారస్తులకు రావాల్సిన ధనం చేతికి రావడంలో ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అలర్ట్ గా ఉండాలి. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది . పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. నవగ్రహ  స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల

ఈరోజు తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా కలసి వస్తుంది.  రైతాంగం, సినీరంగం వారికి శుభఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు అనుకూలం. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారిపై రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. శత్రువర్గం సమస్యలు ఏర్పడును. దశమంలో కుజుడు, భాగ్యములో రవి, శుక్రుల అనుకూల స్థితి వల్ల ఒత్తిళ్ళను అధిగమించి ముందుకు సాగుతారు.  ఒక వార్త ఆనందాన్నిస్తుంది. శివ అష్టోత్తర శతనామావళి, సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

Also read : Pope Francis-LGBT People : స్వలింగ సంపర్కులకూ చర్చి తలుపులు తెరిచే ఉన్నాయ్.. కానీ : పోప్ ఫ్రాన్సిస్

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు కలిగే సూచన ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు పెరుగుతాయి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకరం

ఈరోజు మకర రాశి  వారికి అనారోగ్య సమస్యలు, వేదనలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళతో కూడిన సమయం ఎదురవుతుంది. విపరీత ఆలోచనలు వద్దు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది.  పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. విష్ణు నామస్మరణ ఉత్తమం .

కుంభం

ఈరోజు కుంభ రాశి వారిని ఉద్యోగంలో సమస్యలు, కుటుంబములో సమస్యలు వేధిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కక, రావలసిన ధనం సమయానికి అందక ఇబ్బందులు పడతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. విశ్వనాథాష్టకం పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి ధనలాభము కలిగే సూచన ఉంది . రాజకీయ నాయకులకు కలసి వస్తుంది. ఇది  స్త్రీలకు అనుకూలమైన రోజు.  స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది.  శత్రువర్గం వలన ఇబ్బందులు ఏర్పడినప్పటికి..  మీ ప్రణాళికతో  వాటిని అధిగమిస్తారు. శివారాధన చేయడం మంచిది.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

Exit mobile version