Site icon HashtagU Telugu

Today Horoscope : ఆగస్టు 4 శుక్రవారం రాశి ఫలితాలు ఇవీ..  

Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశిలోని ఉద్యోగుల పనులు సాఫీగా సాగుతాయి.  వ్యాపారస్తులకు వ్యాపారం కలసి వస్తుంది. రైతాంగం వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. నూతన వస్తువులు కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి.  ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని, కృష్ణాష్టకాన్ని పఠించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఇవాళ శుభవార్త వింటారు. వ్యాపారస్తులు ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కేంద్రంలో కుజ, బుధ, శుక్రుల ప్రభావంతో మీరు చేసే పనులన్నీ కలిసివస్తాయి. లక్ష్మీదేవిని పూజించి, క్షీర  అన్నాన్ని నైవేద్యంగా లక్ష్మీదేవికి నివేదిస్తే శుభఫలితాలు కలుగుతాయి. ఇవాళ బంధు,మిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు.

మిథునం

మిథునరాశి వారు ఈరోజు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. వాక్‌ స్థానములో రవి ప్రభావం వల్ల వాదనలు, వివాదాలు అధికంగా ఉండే పరిస్థితి వస్తుంది.  ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకం. పంచదార వెన్న కలిపి చిన్ని కృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Also read : Cleaning Pan : పెనం మీద జిడ్డు ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారా?

కర్కాటకం(Today Horoscope)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అష్టమంలో చంద్రదోషం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు పెరుగుతాయి. కుటుంబ, ఆరోగ్య విషయాలలో కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి.  గొడవలకు దూరంగా ఉండాలి. ధనపరమైనటువంటి విషయాలలో ఈరోజు అనుకూలం. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

సింహం

సింహరాశి వారు అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు ఇబ్బంది ఎదుర్కోవచ్చు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలతో  అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు.

కన్య

కన్యారాశి వారు సౌఖ్యం, ఆనందం కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు.  వ్యయ స్థానములో కుజ, బుధ, శుక్రుల ప్రభావంతో ఖర్చులు  ఎక్కువవుతాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు అనుకూల సమయము. లక్ష్మీస్తోత్రం పఠించండి. శివారాధన మంచిది.

తుల

తులారాశి వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. లాభస్థానములో కుజ, బుధ, శుక్రుల ప్రభావం వల్ల ధనలాభం, సుఖ సంతోషాలు కలుగుతాయి. సంతానం వలన సుఖం కలుగుతుంది. ధన, వస్తు ప్రాప్తి కలదు. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Also read : Amavasya: పొరపాటున కూడా అమావాస్య రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి?

వృశ్చికం

వృశ్చిక రాశివారు ఉద్యోగంలో వ్యాపారంలో లాభాలను పొందుతారు. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. సొంత నిర్ణయాలు పనిచేయవు. సంకుచిత విమర్శలను పట్టించుకోకండి.  విష్ణు సహస్రనామం పఠించండి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో ఇబ్బంది కలుగుతుంది. వ్యాపారస్తులకు ఇది మధ్యస్థ సమయము. శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని, కృష్ణాష్టకం పఠించండి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీస్తోత్రం పఠించండి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

Also read : Black Tea: బ్లాక్ టీ తాగండి.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి?

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే సూచన ఉంది. నరఘోష అధికంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి పనులు సత్ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలం.  కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. దైవారాధన మానవద్దు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు వస్తాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. నూతన వస్తు ప్రాప్తి కలదు.విలాస వస్తువుల కోసం అప్పులు మానాలి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి.  లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

గమనిక: ఈ కథనంలో ఉన్న సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.