Today Horoscope : ఆగస్టు 14 సోమవారం రాశి ఫలితాలు.. వారు అప్పులు తీసుకోవడం మంచిది కాదు

Today Horoscope :ఈరోజు మేషరాశి వారికి  ఉద్యోగంలో ఒత్తిళ్ళు, చికాకులు అధికం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం.

Published By: HashtagU Telugu Desk
Today Horoscope

Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారికి  ఉద్యోగంలో ఒత్తిళ్ళు, చికాకులు అధికం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుగంజ స్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిదికాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును.  అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు బాధిస్తాయి. ఒక ముఖ్య వ్యవహరంలో పెద్దల  సాయం అందుతుంది.  పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. సమయానుకూలంగా ముందుకుసాగండి.  ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకం. రైతాంగం, సినీరంగంవారికి మధ్యస్థ ఫలితాలు. శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. గోవులకు అరటిపళ్ళు తినిపించండి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసెదరు.పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శ్రీ మహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.

సింహం

ఈరోజు సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. మూర్ధత్వముతో వ్యవహరించరాదు. ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారస్తులకు ఖర్చులధికం. ఖర్చులు నియంత్రించుకోవాలి. శ్రమ అధికమవుతుంది. చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. దుర్గ  అష్టోత్తరం చదివితే మంచిది.

Also read : Three Foreign Women : భారత స్వాతంత్ర్యోద్యమంలో ముగ్గురు బ్రిటీష్ మహిళలు

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలం. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. మీ ఆనందము, సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకం. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తుల

ఈరోజు తులారాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.  ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. మీరు చేసే ప్రతీ పని కలసివచ్చును. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది.  ఉన్నత అధికారుల మన్ననలు పొందెదరు. రైతాంగం, సినీరంగం, రాజకీయ రంగాలవారికి ఈరోజు కలసివచ్చును. శివాష్టకం, సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశి వారు కుటుంబ, ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలకు చెడు సమయం. సంతానం వలన చికాకులు కలుగుతాయి. మనస్సును నియంత్రించుకోవాలి. అనసవర విషయాలు ప్రస్తావించరాదు. చెడు ఫలితాలు అధికం. పని ఒత్తిళ్ళు అధికం.  ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని ఇస్తుంది.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి సంతానం వలన ఇబ్బందులు కలుగును. కుటుంబంలో సమస్యలు ఏర్పడును. స్త్రీలకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు, ఇబ్బందులు కలుగును. అనవసర ఖర్చులు వస్తాయి.  నిర్ణయాలలో  స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఇబ్బందికరం. వ్యాపారస్తులకు అనారోగ్య సమస్యలు కలుగు సూచన. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది. శని శ్లోకం  పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

Also read : Rule In Cricket: క్రికెట్ లో ఈ రూల్ గురించి తెలుసా..? బ్యాట్స్‌మెన్ ఇలా చేస్తే ఔట్..?!

మకరం

ఈరోజు మకర రాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మీరు చేసే పనులు కలసివచ్చును. ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి లాభము ఉంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబములో సమస్యలు వేధించును. అప్పులు బాధించును. ఏ పని ప్రయత్నించినా చికాకులు ఏర్పడును. వ్యాపారస్తులకు చెడు ఫలితం అధికముగా ఉన్నది. బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

మీనం 

ఈరోజు మీన రాశి వారు గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. ధనపరమైనటువంటి ఇబ్బందులు కలుగును.  ఖర్చులు పెరుగును. కోర్టు సమస్యలు ఉన్నాయి. అప్పులు చేయరాదు. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

  Last Updated: 14 Aug 2023, 08:32 AM IST