Weekly Horoscope : ఆగస్టు 13 నుంచి 19 వరకు వార ఫలాలు.. వారికి శత్రుదోషం

Weekly Horoscope : ఈవారం మేషరాశి వారికి  అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. పనుల్ని వాయిదా వేయవద్దు. ఒత్తిడి పనికిరాదు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆవేశ పరిచేవారు తారసపడతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. భగవన్నామాన్ని స్మరించండి.

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 08:02 AM IST

Weekly Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (ఆగస్టు 13 నుంచి 19 వరకు) రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈవారం మేషరాశి వారికి  అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. పనుల్ని వాయిదా వేయవద్దు. ఒత్తిడి పనికిరాదు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆవేశ పరిచేవారు తారసపడతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. భగవన్నామాన్ని స్మరించండి.

వృషభ రాశి

ఈవారం వృషభ రాశిలోని ఉద్యోగస్తులకు అనుకూల సమయం. కుటుంబములో సమస్యల వల్ల నిరాశకు గురవుతారు. మీ తప్పుడు నిర్ణయాల వల్ల కుటుంబం ఒత్తిళ్ళకు గురవుతుంది. ఆచితూచి వ్యవహరించండి. చెడు ఊహించవద్దు. మీకు సహాయం చేయడానికి సన్నిహితులు ముందుకు వస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

మిథునం

ఈవారం  మిథునరాశి వారికి మానసిక ఒత్తిళ్ళ వల్ల శారీరక సమస్యలు కలుగును. మీ విలువైన వస్తువులను కోల్పోయే అవకాశముంది. ఇతరులు మీకు అండగా నిలుస్తారు. ఎదురు చూస్తున్న ముఖ్యమైన పని పూర్తవుతుంది. శత్రు దోషం తొలగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

కర్కాటకం

ఈవారం కర్కాటక రాశి వారికి  అనుకూలం. శుభవార్తలు వింటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి.  అనవసర విషయాలకు దూరంగా ఉండండి. కుటుంబం, బంధువుల నుంచి ఒత్తిళ్ళు అధికం. మౌనం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు ఆశించిన ఫలితాలు పొందలేరు. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహం

ఈవారం సింహరాశి వారికి కుటుంబ పనులలో పిల్లలు సహాయపడతారు. రాజకీయ నాయకులకు అనుకూలం.మీరు చేసే ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వివాదాల జోలికి వెళ్లద్దు. కుటుంబసభ్యుల సాయంతో సమస్యలను అధిగమించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి.

Also read : Mahatma Gandhi – 1947 August 15th : 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా గాంధీ ఏం చేశారంటే ?

కన్య(Weekly Horoscope)

ఈవారం కన్యారాశి వారు అప్పులివ్వరాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అనారోగ్య సమస్యలు కలుగును. మానసిక ఒత్తిళ్ళకు లోనయ్యే అవకాశం. మీరు చేసే ప్రయత్నాలకు మీ తల్లిదండ్రులు గర్వపడతారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఏ విషయాన్నీ మనసుకు తీసుకోవద్దు. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తుల

ఈవారం తులారాశి వారికి అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉన్నాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. మీ మొండి వైఖరి వివాదాలకు కారణమవుతుంది. మీరు చేసే పనుల కారణంగా ఒత్తిళ్ళకు గురి అవుతారు. వాహనాలు వేగంగా నడపడం అంత మంచిది కాదు. విదేశీ ప్రయత్నాలకు ఆటంకం ఉంది. నవగ్రహపీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

వృశ్చికం

ఈవారం వృశ్చిక రాశివారు వృత్తి ఉద్యోగాల్లో విజయం పొందుతారు. పొరపాటు జరిగినా అధైర్యపడవద్దు. వ్యాపారంలో అజాగ్రత్త వద్దు. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఎవరేమనుకున్నా ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.

ధనుస్సు

ఈవారం ధనుస్సు రాశి వారు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ కలుగును. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ధనాన్ని ఆచి తూచి పెట్టుబడి పెట్టాలి. కార్యం సానుకూలం కావాలంటే సమయస్ఫూర్తి అవసరం.  ఇతరులపై ఆధారపడవద్దు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. సూర్యభగవానుణ్ణి ధ్యానిస్తే మేలు జరుగుతుంది.

Also read :  Freedom Fighters: స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న తెలుగు వీరులు వీరే..!

మకరం

ఈవారం మకర రాశి వారికి ఆదాయం పెరుగును. పని ఒత్తిళ్ళకు లోనవుతారు. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఇతరులతో ఏర్చడే భేదాభిప్రాయాలు ఇబ్బందిపెట్టును. కొన్ని వ్యతిరేక ఫలితాలున్నా సంయమనాన్ని పాటించండి. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. శుభవార్తలు వింటారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభం

ఈవారం కుంభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. నూతన కార్యక్రమాలు చేపట్టబోయే ముందు ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మూర్ధత్వంతో వ్యవహరించరాదు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహశ్లోకాలతో పాటు విష్ణుస్మరణ చేస్తే మంచిది.

మీనం 

ఈవారం మీన రాశి వారు మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకోవాలని సూచన. నూతన కార్యక్రమాలు చేపట్టబోయే ముందు ఆత్మీయుల సలహాలు తీసుకోండి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక లాభం పొందుతారు. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. లలితా సహస్ర నామాన్ని పఠించండి. నవగ్రహశ్లోకాలతో పాటు విష్ణుస్మరణ చేస్తే మంచిది.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.