Atishi is the new Chief Minister of Delhi: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా ఎన్నికయ్యారు. ఆప్ ఎమ్మెల్యేలు ఆమెను సీఎంగా ఎన్నుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. అతిశీ పేరును సీఎంగా ప్రకటించిన తరువాత సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. కేజ్రీవాల్ మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనాతో సమావేశం కానున్నారు. ఆ తరువాత తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. అదేవిధంగా.. నూతన సీఎంగా అతిశీ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ ప్రతిపాదనను, ఎమ్మెల్యే మద్దతును తెలియజేనున్నారు.
Read Also: Ganesh Immersion Ceremony : గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నసీఎం రేవంత్
సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించిన రోజు నుంచి తరువాత ముఖ్యమంత్రిగా అతిశీ పేరు ప్రముఖంగా వినిపించింది. అతిశీ (43) సంవత్సరాలు. ప్రస్తుతం ఢిల్లీ ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ వంటి కీలక శాఖల మంత్రిగా ఆమె ఉన్నారు. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె ఢిల్లీలోని పాఠశాలల్లో విద్య నాణ్యతను మరింత మెరుగుపరచడానికి కృషిచేశారు. కల్కాజీకి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అవినీతి కేసులో సిసోడియా అరెస్టయిన తర్వాత అతిశీ మంత్రి అయ్యారు. కేజ్రీవాల్, సిసోడియా జైలుకు వెళ్లిన సమయంలో ఆమె పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు.