అంతరిక్షంలో నాసా వ్యోమగామి అద్భుత ఫీట్.. చూస్తే వావ్ అనాల్సిందే!

సాధారణంగా మనం ఏదైనా పర్వతం నుంచి కానీ లేదంటే ఎత్తయిన అపార్ట్మెంట్ నుంచి గానీ కిందికి చూస్తే గుండెలు జారి పోతూ ఉంటాయి.

  • Written By:
  • Updated On - June 22, 2022 / 11:18 AM IST

సాధారణంగా మనం ఏదైనా పర్వతం నుంచి కానీ లేదంటే ఎత్తయిన అపార్ట్మెంట్ నుంచి గానీ కిందికి చూస్తే గుండెలు జారి పోతూ ఉంటాయి. కొంతమంది భవనంపై సురక్షితంగా ఉన్నప్పటికీ ఎక్కడ కిందికి పడిపోతామో అని భయం భయంగా ఉంటారు. మరి కొందరు మాత్రం ఎటువంటి భయం లేకుండా విమానం నుంచి హెలికాప్టర్ల నుంచి ప్యారా చూట్ కట్టుకొని మరి సాహసాలు చేస్తూ ఉంటారు. కానీ భూమికి కొన్ని వందల వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్షంలో ఎటువంటి ఆధారం లేకుండా తేలుతూ ఉంటే.. వామ్మో అనిపిస్తుంది.

మరి 1984లో నాసా నిర్వహించిన ఛాలెంజర్ స్పేస్ షటిల్ ప్రయోగ సమయంలో మెక్ క్యాండెలెస్ అనే వ్యోమగామి చాలా సేపటి వరకు తేలిపోయాడు. సాధారణంగా అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ షటిల్ దాటి బయటకు వచ్చే వ్యోమగాములు పెద్ద తాడు వంటిది కట్టుకొని ఉంటారు. అందుకు గల కారణం ఒక్కసారి అంతరిక్షంలో దూరంగా వెళ్లి పోతే ఇక అంతే మళ్ళీ దొరకడం కష్టం. అలా భూమి చుట్టూ తిరుగుతూనే ఉండిపోవడం, ఆ తర్వాత భూమి పైకి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది.

కానీ మిల్క్ క్యాండెలెస్ మాత్రం ప్రత్యేకమైన స్పేస్ సూట్ ధరించి అలా దూరంగా వెళ్ళ గలిగాడు. ఎందుకంటే అంతరిక్షంలో కాస్త దూరం ప్రయాణించి పరికరాలు ఆ స్పేస్ సూట్ లో ఉన్నందువల్ల మెక్ అంతదూరం మెల్ల కలిగాడు అని నాసా ప్రకటించింది. అంతేకాకుండా తాడు లేకుండా స్పేస్ లోకి వెళ్లిన మొట్టమొదటి వ్యోమగామి కూడా ఆయనే అని తెలిపింది. ఇక 1984 నాటి ఫోటోను తాజాగా ప్రఖ్యాత సైన్స్ నేచర్ వెబ్సైట్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగలరు ట్రెండింగ్ గా మారింది. ఆ ఫోటో పోస్ట్ చేసిన ఒక్కరోజులోనే దాదాపుగా లక్షన్నరకు పైగా లైకులు వచ్చాయి. ఈ వేల మంది ఆ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటో ని చూసిన కొంతమంది ఇప్పటివరకు అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలు ఇదే ఎక్కువ భయపెడుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.