Site icon HashtagU Telugu

Controversial Cop Killed : అస్సాం ‘లేడీ సింగం’ దుర్మరణం..సడెన్ గా ఏమైంది ?

Controversial Cop Killed

Controversial Cop Killed

ఆమె ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్.. అందుకే అందరూ ‘లేడీ సింఘం’ అని పిలిచేవారు.. ఇంకొందరు ‘దబాంగ్ కాప్’ అని అనేవారు.. నేరస్థుల పట్ల ఆమె కఠినంగా వ్యవహరిస్తారని చెప్పుకునేవారు.. ఈవిధంగా జనంలో పేరు సంపాదించిన అస్సాం పోలీసు మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ 30 ఏళ్ళ జున్మోని రభా(Controversial Cop Killed) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. నాగావ్ జిల్లాలో కంటైనర్ ట్రక్కును ఆమె ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. దీంతో ఆమె మృతిచెందారు. కలియాబోర్ సబ్ డివిజన్‌ జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కొన్ని గంటల ముందు జున్మోని రభాపై దోపిడీ కేసు నమోదు కావడం గమనార్హం. ఆమెపై నమోదైన కేసుతో పాటు రోడ్డు ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని జున్మోని రభా(Controversial Cop Killed) కుటుంబసభ్యులు కోరుతున్నారు.మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసు పెట్రోలింగ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారని జఖలబంధ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పవన్ కలిత తెలిపారు. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కంటైనర్ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడని చెప్పారు. నాగావ్ పోలీస్ సూపరింటెండెంట్ లీనా డోలీ ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

also read : Get Fit In 3 Months Or Retire : పోలీసులు 3 నెలల్లో ఫిట్‌గా మారకుంటే వీఆర్ఎస్

జున్మోని రభా తల్లి, అత్త ఏమన్నారంటే.. 

అయితే ఎస్‌ఐ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో ఎందుకు వెళ్తున్నారనేది తెలియరాలేదు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తో ఈ హత్య జరిగిందని పోలీస్ ఆఫీసర్ జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపించారు. జున్మోని రభా తల్లి సుమిత్రా రభా, అత్త సుబర్ణ బోడో లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మను కలిసి ఈ విషయంపై నిష్పాక్షిక విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. జున్మోని రభా అత్త సుబర్ణ బోడో ఏమన్నారంటే.. “సోమవారం రాత్రి నాగాన్‌లోని జున్‌మోని అధికారిక క్వార్టర్‌లో పోలీసు ఉన్నతాధికారుల బృందం దాడులు నిర్వహించి సుమారు రూ. లక్షను స్వాధీనం చేసుకుంది” అని చెప్పారు. స్వాధీనం చేసుకున్న డబ్బు జున్మోని తల్లికి చెందినదని, ఆమె పౌల్ట్రీ , పందుల పెంపకంతో ఆ డబ్బును సంపాదించిందని తెలిపారు.

అస్సాం డీజీపీ ఏమన్నారంటే..  

చనిపోయిన ఎస్‌ఐ జున్మోని రభా పై నార్త్ లఖింపూర్ పోలీస్ స్టేషన్‌లో నేరపూరిత కుట్ర, దోపిడీ, దోపిడీ, హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, దోపిడీ వంటి ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)  జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. 2022 జనవరి లో బిహ్‌పురియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో జున్మోని రభా టెలిఫోనిక్ సంభాషణ లీక్ కావడంతో వివాదంలో చిక్కుకుంది.చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో కంట్రీ బోట్లను నడుపుతున్నందుకు భుయాన్ నియోజకవర్గానికి చెందిన కొందరు బోట్‌మెన్‌లను రభా అరెస్టు చేశారు. దీనిపై అక్కడి బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఫోన్ కాల్ కు ఘాటుగా ఆన్సర్స్ ఇచ్చారు. ఈ ఆడియో టేప్ లీకై దుమారానికి దారితీసింది. అప్పట్లో ఈ వ్యవహారంపై మీడియా ద్వారా స్పందించిన ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ .. ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలని జున్మోని రభా కు హితవు పలికారు.

Exit mobile version