Flight Door Open : సడెన్ గా విమానం తలుపు తెరిచాక.. ఏమైందంటే

విమానం ల్యాండ్ అవుతుండగా ఓ వ్యక్తి తలుపులు(Flight Door Open) తెరిచాడు.

Published By: HashtagU Telugu Desk
Flight Door Open

Flight Door Open

విమానం ల్యాండ్ అవుతుండగా ఓ వ్యక్తి సడెన్ గా పరుగెత్తుకు వెళ్లి తలుపులు(Flight Door Open) తెరిచాడు. దీంతో గాలి ఒత్తిడికి  అతడు విమానం లోపలికి నెట్టబడ్డాడు.. ఒక్కసారిగా విమానంలోకి గాలి చొరబడటంతో..  అందులోని 194 మంది ప్రయాణికులు శ్వాస పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. శ్వాసకోశ సమస్యలు కలిగిన వారు చాలా ఇబ్బందిపడ్డారు. కొంతమంది ప్రయాణికులు స్పృహతప్పి పడిపోయారు.  దక్షిణ కొరియాలోని డేగు అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్ కు 250 మీటర్ల ఎత్తులో ఏషియానా ఎయిర్‌లైన్స్ విమానం ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Also read : VietJet Passengers : 100 మంది..1 విమానం..12 గంటలు

మొత్తం మీద ప్రయాణికులు అందరూ  విమానం నుంచి  సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఆ వెంటనే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించారు. 30 ఏళ్ల  ఒక వ్యక్తి తనకు ఊపిరాడకపోవడంతో.. త్వరగా విమానం నుంచి దిగే ప్రయత్నంలో డోర్ ను తెరిచాడని(Flight Door Open) గుర్తించారు. ఉద్యోగం పోయిన తర్వాత ఒత్తిడిలో ఉన్న తనకు .. విమానంలో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అయిందని అతడు చెప్పాడు.

  Last Updated: 27 May 2023, 11:10 AM IST