Site icon HashtagU Telugu

Arvind Kejriwal : తిహార్ జైల్లో టార్చర్‌ చేశారు : కేజ్రీవాల్‌

Arvind Kejriwal alleges 'torture' in Tihar jail

Arvind Kejriwal alleges 'torture' in Tihar jail

Haryana Election Rally: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)చీఫ్‌, ఢిల్లీమాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్‌29)హర్యానాలో జరిగిన బహిరంగసభలో కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జైలులో నన్ను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు. నేను షుగర్‌ పేషేంట్‌ను. నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్‌ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు అందకుండా చేశారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే. వాళ్లు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను హర్యానా బిడ్డను’అని కేజ్రీవాల్‌ అన్నారు.

Read Also: BJP : ఎనిమిది మంది రెబల్స్‌పై బీజేపీ వేటు

ఢిల్లీ, పంజాబ్‌లలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని ప్రధాని మోడీ భావించారని, ఇప్పుడు హర్యానాలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని భయపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. “మీరు కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టి 700 స్కూళ్లను మూసివేయాలనుకుంటున్నారు. ఇది మన దేశ ప్రధానికి సరిపోదు.. అన్నారు. హర్యానా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోందని, ఆ పార్టీ అవకాశాలపై కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. “మేము లేకుండా హర్యానాలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయరు కాబట్టి మాకు చాలా సీట్లు వస్తున్నాయి,” అని ఆయన అన్నారు, ఆమ్‌ ఆద్మీ పార్టీ యొక్క ప్రచార హామీలు నెరవేరేలా చూస్తామని కేజ్రీవాల్ అన్నారు.

కాగా, లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత కేజ్రీవాల్‌కు సుపప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. దీంతో ఆయన సెప్టెంబర్‌ 13న తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్‌ఆద్మీపార్టీకి అధికారం ఇస్తేనే తాను సీఎం పదవి తీసుకుంటానని తెలిపారు.

Read Also: CM Mamata Banejee : వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్యం: సీఎం మమతా బెనర్జీ