Site icon HashtagU Telugu

కోవిడ్ పోరుపై ‘సైకత’ సందేశం!

Vaccine

Vaccine

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని సందేశాన్నిచ్చారు. ఈ సైకత శిల్పం  ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తోంది! చాపకింద నీరులా కొవిడ్ విస్తరిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ జనపాలపై విరుచుకుపడుతోంది. వేల సంఖ్యలో ఉన్న కేసులు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా లక్షకు చేరుకుంటున్నాయి. దీంతో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి ప్రాంతాలను బఫర్ జోన్ లుగా ప్రకటిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నాయి. జనాలను అలర్ట్ చేస్తూ.. మాస్కు నిబంధనలను కచ్చితంగా పాటించేలా కఠిన చర్యలకు దిగుతున్నాయి. కొవిడ్ దెబ్బకు కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ దిశగా యోచిస్తున్నాయి.