Site icon HashtagU Telugu

Late Nights: ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Sleep Stress

Sleep Stress

మనలో కొందరికి రాత్రిపూట సరిగా నిద్ర ఉండదు. ఈ అలవాటు వల్ల రకరకాల సమస్యలు వస్తాయని వైద్య అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీ యుగంలో జీవించాలంటే మన అలవాట్లను కూడా మార్చుకోవాలి. పనులన్నీ పూర్తయ్యాక రాత్రి పొద్దుపోయాక టీవీ, సినిమాలు చూడటం ప్రమాదం. సినిమాలు చూడటం, ఫోన్లు నిద్రపోకుండా చేస్తాయి.

ఈ అలవాట్లు క్రమంగా వివిధ సమస్యలకు దారి తీస్తున్నాయని డాక్టర్లు హెచ్చరించారు. రాత్రిపూట సరైన నిద్రపోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తేల్చి చెబుతున్నారు డాక్టర్లు. ఆలస్యంగా నిద్రించే అలవాటు ఉన్నవాళ్లు గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అర్ధరాత్రి దాకా నిద్రపోవడం, మద్యం సేవించడం లాంటివి క్రమంగా అలవాటు అయితే అయితే కొన్నిసార్లు మరణానికి దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

రోజుకు 7 నుంచి 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మీ గుండె ప్రమాదంలో పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రక్త నాళాల్లో బ్లాకులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవడం మంచి అలవాటు. మానసికంగా కూడా మంచ జీవితాన్ని గడపాలంటే నిద్ర చాలా అవసరం. మీరు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి, తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు, తల బరువుగా ఉండి, శరీరం బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరం, శక్తి స్థాయి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే కనీసం 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. రోజూ 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో చేతులు , కాళ్ళ ధమనుల్లో బ్లాకులు ఏర్పడతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Also Read: BRS MLAs: పడిపోయిన ఎమ్మెల్యేల గ్రాఫ్.. 40 మందికి నో టికెట్స్?