Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ నెలలో వరుస సెలవులు?

మామూలుగా పాఠశాలలకు అదే విధంగా బ్యాంకులకు ప్రతి నెల ప్రభుత్వ సెలవులు ఉంటాయి. ఇక బ్యాంకులో సెలవుల

  • Written By:
  • Updated On - August 29, 2022 / 08:09 PM IST

మామూలుగా పాఠశాలలకు అదే విధంగా బ్యాంకులకు ప్రతి నెల ప్రభుత్వ సెలవులు ఉంటాయి. ఇక బ్యాంకులో సెలవుల విషయానికొస్తే సాధారణ సెలవులతో పాటు పండుగలకు కూడా ప్రత్యేకంగా సెలవును ప్రకటిస్తూ ఉంటారు. ఇకపోతే సెప్టెంబర్ లో బ్యాంకుల సెలవుల విషయానికొస్తే..ఆదివారాలు, రెండో శనివారాలు కలుపుకొని మొత్తంగా 14 రోజులు సెలవులు రానున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు కూడా మూత పడనున్నాయి. అంతే కాకుండా రాష్ట్రాల బట్టి కూడా సెలవులు ఉండనున్నాయి. కాగా సెప్టెంబర్‌ నెలలో మొత్తం 8 రోజులు సెలవులు ఉన్నాయి. ఇవి కాకుండా శని, ఆదివారాలు కలిపి 6 రోజులున్నాయి.

అయితే మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయన్న మాట. భారత్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఏ ఏ రోజులు ఏ సెలవులు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్‌ 1వ తేదీన గోవాలో వినాయక చవితి, సెప్టెంబర్‌ 6న జార్ఖండ్‌లో కర్మపూజ పేరుతో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అలాగే సెప్టెంబర్‌ 7,8 తేదీల్లో కేరళలో ఓనం పండగ, 9వ తేదీ సిక్కిం, గ్యాంగ్‌టక్‌లో ఇంద్రజాత సెలవుంది. ఇక 10వ తేదీన శ్రీ నరవణ గురు జయంతి సందర్బంగా కేరళలో బ్యాంకులకు సెలవు.అలాగే సెప్టెంబర్‌ 21న కేరళలో శ్రీనారాయణ గురు సమాధి దినం సందర్భంగా సెలవు.

సెప్టెంబర్‌ 26న నవరాత్రి స్థాపన కారణంగా మణిపాల్‌, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు. అదేవిధంగా సెప్టెంబర్‌ 24వ తేదీన నాలుగో శనివారం. ఇలా వివిధ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లో సెలవులు ఉండనున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ నెలలో సెలవుల జాబితా విషయానికి వస్తే..సెప్టెంబర్‌ 1 గణేష్‌ చతుర్థి రెండో రోజు సెప్టెంబర్‌ 6 కర్మపూజ,సెప్టెంబర్ 7,మొదటి ఓనం సెప్టెంబర్‌ 8 తిరువోనం, సెప్టెంబర్ 9 ఇంద్రజాత, సెప్టెంబర్ 10 -శ్రీ నరవణ గురు జయంతి సెప్టెంబర్‌ 21- శ్రీ నారాయణ గురు సమాధి దినం సెప్టెంబర్‌ 26- నవరాత్రి స్థాపన కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉండదు. ఇక వారాంతపు సెలవుల జాబితావిషయానికి వస్తే..సెప్టెంబర్‌ 4న మొదటి ఆదివారం సెప్టెంబర్ 10న రెండో శనివారం సెప్టెంబర్‌ 11 మూడవ ఆదివారం సెప్టెంబర్‌ 18 న మూడో ఆదివారం సెప్టెంబర్‌ 24 న నాలుగవ శనివారం సెప్టెంబర్‌ 25న నాలుగవ ఆదివారం.