Site icon HashtagU Telugu

Life Partner: తక్కువ వయసున్న వారిని పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే కలిగే నష్టాలివే!

more sleep, more sex

Sex

మంచి ఉద్యోగం, అధిక సంపాదన, లైఫ్ సెటిల్ మెంట్.. ఈ రోజుల్లో చాలామంది ఆలోచనలు ఇలానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జనరేషన్ వాళ్లు అంతా చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి (Marriage) విషయం పక్కన పెడితే చాలా తక్కువ వయసున్న అమ్మాయినో, తక్కువ ఉన్న అబ్బాయినో పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో జంటల మధ్య వయసు (Age) వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చేసుకోబోయే పార్ట్ నర్ (భార్య/భర్త) వయసు మీకంటే తక్కువగా ఉంటే చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు సైకాలజిస్ట్ లు

‘‘నా వయస్సు 35. నా భార్య నా కంటే చాలా చిన్నది (Smaller). వయసు 25 మాత్రమే. ఇంటి పనులు చక్కగా చేస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల చాలా గౌరవంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లోనూ చాలా బాధ్యతగా ఉంటుంది. కానీ లైంగిక పరమైన విషయాల్లో మాత్రం నా కంటే ఫాస్ట్ గా ఉంటుంది. బెడ్ టైమ్ (Bed Time) నన్ను ఛాలెంజ్ చేస్తోంది. ఆ సమయంలో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు’’ ఇటీవల పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు ఆవేదన

‘‘నా భార్య నాకంటే 11 సంవత్సరాలు చిన్నది. జీవితం పట్ల ఆమెకున్న మక్కువతో నేను పెళ్లి చేసుకున్నా. కానీ పెళ్లయిన 3 సంవత్సరాల తరువాత, నేను ఒకరకమైన బాధతో భాదపడుతున్నా. ముఖ్యంగా నా సహోద్యోగులను కలిసినప్పుడు నా భార్య అమర్యాదగా (Rude) వ్యవహరిస్తుంది. అందరి ముందు చిన్న పిల్లాల వ్యవహరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి నాపైనే ఆధారపడి ఉంటుంది’’ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సమస్య

‘‘నా భార్య మంచిది. కానీ ఆమె స్నేహితులు (Friends) తండ్రితో ఎలా ఉంటారో, నాతో అలానే ఉంటారు. నా భార్య నాకంటే 15 ఏళ్లు చిన్నది కావడమే అందుకు కారణం. మాకు పెళ్లయి 7 ఏళ్లు. పార్టీలకు, ఫంక్షన్లకు మేమిద్దరం కలిసి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను. కొంతమంది మీ భార్య ఎక్కడా అని క్విశ్చన్ చేస్తుంటారు’’ అని గవర్నమెంట్ టీచర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘నా వైఫ్ బెడ్ రూంలో ప్రయోగాలు చేయడానికి సిద్దంగా ఉంటుంది. మా సెక్స్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. పోర్ ప్లే, టచ్ అన్ని విషయాలను ఇష్టపడుతుంది. అయితే ప్రస్తుతం నాకు 40 ఏళ్లు. రోజురోజుకూ లైంగిక పరమైన విషయాల్లో ఆసక్తి ఉండటం లేదు. కానీ భార్య (Wife) మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది’’ అని ఓ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: Mahesh Babu: సమ్మర్ ఎఫెక్ట్.. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు మహేశ్ బాబు!

Exit mobile version