Cancer Risk: మీరు నిలబడి తింటున్నారా.. అయితే క్యానర్స్ బారిన పడినట్టే

  • Written By:
  • Updated On - January 20, 2024 / 11:50 AM IST

Cancer Risk: క్యాన్సర్ బారిన పడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు. అనేక రూపాల్లో క్యాన్సర్ బారిన పడుతూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో రూపంలో క్యాన్సర్ భయపెడుతోంది. అదే నిల్చొని తినటం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. లక్నోలోని కల్యాణ్సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన రేడియోథెరపీ విభాగ అధిపతి రాకేశ్ కపూర్ ఆధ్వర్యం లోని బృందం నిల్చొని తినటం వల్ల కలిగే అనర్థాలపై పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనల్లో నిల్చొని తిన్నప్పుడు అన్నవాహిక సంబంధిత వ్యాధులు వస్తాయని తేలింది.

నిల్చొని నీళ్లు తాగినా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. నిల్చొని తిన్నా, నీళ్లు తాగినా అన్నవాహిక కండరాల పనితీరుకు అడ్డు తగిలి జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు వివరించారు. ఈ పరిస్థితి రానురానూ అన్నవాహిక క్యాన్సర్కు దారితీస్తుందని వెల్లడించారు. అదేవిధంగా, జీవితంలో ఎదిగే క్రమంలో మహిళలు పెండ్లిని ఆలస్యం చేస్తున్నారని, దీని ప్రభావంతో వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. కాగా క్యాన్సర్‌ రేట్‌ పెరిగిందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రధానంగా 50 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో క్యాన్సర్‌ కేసులు పెరిగాయని స్పష్టం చేసింది. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం, యువతలో అత్యధిక సంఖ్యలో క్యాన్సర్ కేసులు పెరిగాయాని స్పష్టం చేసింది. అధ్యయనం ప్రకారం, యువతలో అత్యధిక సంఖ్యలో క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా జీర్ణశయాంతర క్యాన్సర్‌లు, అన్ని రకాల క్యాన్సర్‌ల కంటే.. 14.80% ఎక్కువగా పెరుగుతున్నాయి.