Appointment of chairmen for three committees in the Assembly : శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్యని నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Pawan Kalyan : వరద ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలను ప్రకటించారు. పీఏసీ కమిటీకి చైర్మన్‌గా ప్రతిపక్ష ఎమ్మెల్యేను నియమించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అరికపూడి గాంధీ, సభ్యులుగా వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామారావు పవర్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు, టి. జీవన్ రెడ్డి, భానుప్రసాద్ రావు, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్ ను నియమించారు.
అంచనాల కమిటీ చైర్ పర్సన్‌గా ఉత్తమ్ పద్మావతిరెడ్డి, సభ్యులుగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, సీహెచ్ విజయరమణారావు, కోరం కనకయ్య, రాందాసు మాలోతు, మామిడాల యశస్వీని, పి. రాకేష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి. రవీందర్ రావు, వి. యాదవరెడ్డిని నియమించారు. అదే విధంగా పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా వీర్లపల్లి శంకర్, సభ్యులుగా పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పట్లోళ్ల సంజీవరెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కౌసర్ మోహినోద్దీన్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డి, తోట మధుసూదన్, మీరజ్ రియాజుల్ హాసన్ ఎఫెండీలను నియమిస్తూ స్పీకర్ బులెటెన్ విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ శాసనసభ మొత్తంగా 3 ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసిందనమాట. అన్ని కమిటీల్లోనూ మొత్తం 12 మంది చొప్పున సభ్యులు ఉండనున్నారు.
కాగా, ప్రతిపక్ష పార్టీ నేతకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీకి ఆ పదవి కట్టబెట్టడం హాస్యాస్పదమన్నారు. అయితే.. పీఏసీ పదవి కోసం బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.