Site icon HashtagU Telugu

Apple Sneakers-42 Lakhs : యాపిల్ స్నీకర్స్ కొనేయండి.. ఒక జత 42 లక్షలే

Apple Sneakers 42 Lakhs

Apple Sneakers 42 Lakhs

Apple Sneakers-42 Lakhs : మీకు స్నీకర్స్ కావాలా ?

అయితే కోనేయండి.. ధర కేవలం రూ. 42 లక్షలే !!

ఔను.. మీరు చదివింది నిజమే.. 

యాపిల్ (Apple) కంపెనీ స్పెషల్ గా తయారు చేయించిన స్నీకర్స్ అవి.. అందుకే అంత రేటు !!

గతంలో ఈ  స్నీకర్స్ ను కేవలం యాపిల్ ఉద్యోగులకు మాత్రమే అమ్మేవారు.

Also read : IPL 2024: ఆర్సీబీ నుంచి దినేష్ కార్తీక్ అవుట్?

ఒకే ఒక జత “యాపిల్  ట్రైనర్‌” స్నీకర్స్ ను వేలానికి పెట్టారు.  ప్రఖ్యాత వేలం సంస్థ  “సోథెబీస్” లో వీటిని వేలం వేస్తున్నారు. ఇప్పటివరకు “యాపిల్  ట్రైనర్‌” స్నీకర్స్ ను బహిరంగ మార్కెట్లో సేల్ చేయలేదు.  ఇప్పుడు తొలిసారిగా ఒక్క జత వేలానికి వచ్చింది. ఈ బూట్లను అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారు. 1990వ దశకంలో అమెరికాలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్ లో “యాపిల్  ట్రైనర్‌” స్నీకర్స్ ఎవరికో  బహుమతిగా  వచ్చాయని, వారు ఇప్పుడు  వాటిని “సోథెబీస్”  ద్వారా వేలానికి పెట్టారని తెలుస్తోంది. “సోథెబీస్”   సంస్థ ఈ షూస్ ను రూ.42 లక్షల ప్రారంభ ధరతో వేలానికి పెట్టింది. ఈ షూస్ పై  రెయిన్‌బోతో  యాపిల్ కంపెనీ పాత లోగో  కూడా ఉంది. వాస్తవానికి ఈ స్నీకర్లను యాపిల్ కంపెనీ స్వయంగా  తయారు చేయలేదు. ఒమేగా స్పోర్ట్స్‌ అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చి  వీటిని తయారు చేయించింది.

Also read : China Military Base In Cambodia : ఆ దేశంలో చైనా సైనిక స్థావరం రెడీ.. మూడు దేశాలకు గుబులు

గతంలో యాపిల్ జాకెట్స్, వాచ్ స్ట్రాప్స్

  • గతంలో తమ ఉద్యోగుల కోసం యాపిల్ కంపెనీ పార్క్ జాకెట్లను రిలీజ్  చేసింది.
  • 2015లో వాచ్ స్ట్రాప్‌ల తయారీ కోసం  లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హెర్మెస్‌ (hermes)తో యాపిల్ కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది.
  • గతంలో యాపిల్‌తో భాగస్వామిగా వ్యవహరించి ప్రోడక్ట్స్ తయారుచేసిన కంపెనీల లిస్టులో హోండా (Honda), బ్రాన్ (Braun), లామీ(Lamy)  కూడా ఉన్నాయి.
Exit mobile version