Site icon HashtagU Telugu

AP Polycet 2023 Results : పాలీసెట్‌ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేస్కోండి

Ap Polycet 2023 Results

Ap Polycet 2023 Results

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్‌ ఫలితాలు (AP Polycet 2023 Results) శనివారం ఉదయం 10.45 నిమిషాలకు రిలీజ్ అయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్  కు 1,43,592 మంది హాజరయ్యారు. వీరిలో బాలికలు 55,562 మంది, బాలురు 88,030 మంది ఉన్నారు. 87 ప్రభుత్వ, 171  ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా – గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in లోకి వెళ్లి ఫలితాలను(AP Polycet 2023 Results) చెక్ చేసుకోవచ్చు.

ఇలా చెక్ చేసుకోండి..  

రిజల్ట్ లింక్ ఇదేhttps://polycetap.nic.in