New Liquor Policy : ఏపీలో అక్టోబరు 1 నుండి నూతన మద్యం విధానం

కొత్త మద్యం పాలసీ రూపకల్పన లక్ష్యంగా ఏపి ప్రభుత్వం సమగ్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.

Published By: HashtagU Telugu Desk
Chandrababu Gift

Chandrababu Gift

New Liquor Policy: నూతన మద్యం విధానం రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం(AP Govt) కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌ పాలసీ, మద్యం షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్‌ పేమెంట్‌ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ట్రాక్ అండ్ ట్రేస్, డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా దృష్టి సారించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఈ నెల 12 లోగా నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబరు 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

Read Also: Sugar Cane Juice: అలాంటి సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగుకూడదా?

  Last Updated: 02 Aug 2024, 05:22 PM IST