Site icon HashtagU Telugu

Anushka Sharma: విరాట్ కోహ్లీ పై అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్

anushka virat

anushka virat

క్రికెట్ లో ప్రపంచ టాప్ క్లాస్ ప్లేయర్ మరియు టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్‌ కోహ్లి తన టెస్ట్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్‌ వేదికగా శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విరాట్ తన 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

ప్రస్తుతం తన తీసుకున్న ఈ నిర్ణయంతో సోషల్‌ మీడియాలో విరాట్‌ కోహ్లీ ట్రెండింగ్‌లో ఉన్నాడు. కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో అతని ఫ్యాన్స్ ఎంతగానో షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే టీం ఇండియా మాజీ సారధి విరాట్‌ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తన ఇన్‌స్టా గ్రామ్‌లో టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కోహ్లీపై ఎంతో భావోద్వేగంతో సుధీర్ఘమైన పోస్ట్‌ చేసింది.

‘2014లో టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని ఎంఎస్‌ ధోని నిర్ణయం తీసుకున్నందునే నిన్ను కెప్టెన్‌గా చేశారని నువ్‌ చెప్పిన రోజు నాకు గుర్తుంది. ఆ రోజు తర్వాత ఎంఎస్‌, నువ్‌, నేను చాట్‌ చేసుకున్నాం. నీ గడ్డం ఎంత త్వరగా నెరిసిపోతుందో అని అతను సరదాగా చెప్పాడు. దాని గురించి మనం బాగా నవ్వుకున్నాం. ఆ రోజు నుంచి నేను నీ గడ్డం నెరసిపోవడమే కాకుండా చాలా చూశాను. నేను అపారమైన అభివృద్ధిని చూశాను. నీ చుట్టూ, నీలోపల నువ్వు ఎదిగిన తీరు చూశాను.

భారత జాతీయ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నీ ఎదుగల, నీ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాల గురించి నేను చాలా గర్వపడుతున్నాను. అంతకన్నా ఎక్కువగా నీలో నువ్వు సాధించిన అభివృద్ధికి నేను మరింతగా గర్వపడుతున్నాను. మీరు చేసిన ఏ పనిలో ఎలాంటి దురుద్దేశం లేదు. నువ్వు, నా ప్రేమ అపరిమితం. ఈ ఏడు సంవత్సరాలుగా తన తండ్రి నేర్చుకోవడాన్ని మన కుమార్తె చూస్తుంది.’ అంటూ కోహ్లీ ని ప్రేమగా బుగ్గపై ముద్దాడిన ఫొటోను షేర్‌ చేసింది అనుష్కశర్మ.