Site icon HashtagU Telugu

APPSC : ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం

Anuradha appointed as the new Chairperson of APPSC

Anuradha appointed as the new Chairperson of APPSC

APPSC Chairperson: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏపీపీస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌సవాంగ్‌ను నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన రాజీనామా చేయడంతో కొన్ని నెలలుగా ఏపీపీఏస్సీ ఛైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో అనురాధను నియమిస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ప్రభుత్వం ఏపీపీఎస్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనువైన అధికారిగా.. ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను ప్రభుత్వం నియమించింది. అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. వీటితో పాటుగా డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఎస్పీగా, ఐజీగా ఆమె సేవలు అందించారు. 1987 బ్యాచ్‌కు చెందిన అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి కావడం విశేషం.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని టీడీపీ తీవ్రంగా ఆరోపించింది. ముఖ్యంగా గ్రూప్‌-1 పరీక్షల మూల్యాంకనంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని, కొంతమంది అభ్యర్థులకు అన్యాయం చేశారని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారిన వెంటనే, సవాంగ్ పదవీ కాలం ఇంకా ఉండగా కూడా ఏపీపీఎస్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో తాజాగా ప్రభుత్వం అనురాధను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Gangavva : బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు నమోదు..ఎందుకంటే..!!