Antarctica To Shadnagar : అంటార్కిటికా టు షాద్‌నగర్.. ఇస్రో 110 కోట్ల ప్రాజెక్ట్

తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించబోతోంది. భూమికి దక్షిణ ధృవంలోని అంటార్కిటికా ఖండం కేంద్రంగా ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు భారత్ సాగిస్తున్న పరిశోధనలకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్‌నగర్ లో ఉన్న ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(Antarctica To Shadnagar) మారబోతోంది. 

Published By: HashtagU Telugu Desk
Antarctica To Shadnagar

Antarctica To Shadnagar

తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించబోతోంది. భూమికి దక్షిణ ధృవంలోని అంటార్కిటికా ఖండం కేంద్రంగా ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు భారత్ సాగిస్తున్న పరిశోధనలకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్‌నగర్ లో ఉన్న ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(Antarctica To Shadnagar) మారబోతోంది.  అంటార్కిటికాలో మన దేశానికి మైత్రి, భారతి అనే 2 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి.  వాటిలో నిత్యం 100 మంది భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలు, వాతావరణ పరిశోధనలు చేస్తుంటారు. అంటార్కిటికా ఖండంలో నిర్మలంగా ఉండే ఆకాశంలో ఎలాంటి రేడియో సంకేతాల అవరోధాలు ఉండవు. అందుకే ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు అది ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్.

11,000 కిలోమీటర్ల దూరంలోని అంటార్కిటికాతో లింక్

అంతరిక్ష పరిశోధనలు, వాతావరణ పరిశోధనలు,  ఉపగ్రహాలపై నిఘా సమాచారాన్ని కూడగట్టే క్రమంలో మన శాస్త్రవేత్తలకు  అంటార్కిటికా ఖండంలో ఒక పెద్ద అవరోధం ఉంది. అదే హై స్పీడ్ ఇంటర్నెట్. ఈ లోటును అధిగమించే లక్ష్యంతో తెలంగాణలోని ISRO యొక్క షాద్‌నగర్ సెంటర్ ను 11,000 కిలోమీటర్ల దూరంలో అంటార్కిటికాలో ఉన్న మైత్రి, భారతి పరిశోధనా కేంద్రాలను లింక్ చేసే కసరత్తును  ఇస్రో   మొదలుపెట్టింది. ఈ రెండు లొకేషన్ల మధ్య బలమైన ఉపగ్రహ లింక్‌ను ఏర్పాటు చేయడానికి రూ.110 కోట్ల భారీ  ప్రాజెక్ట్ ను(Antarctica To Shadnagar) ఇస్రో  ప్రారంభించబోతోంది.

also read : Antarctica goes dark: అంటార్కిటికా పై ఇక 4 నెలలు చీకటే.. తిమిరంలో సమరం చేస్తున్న శాస్త్రవేత్తలు!!

టెండర్లకు ఆహ్వానం 

ఇందులో భాగంగా  ISRO యొక్క షాద్‌నగర్ సెంటర్ లో కేఏ -బ్యాండ్ శాటిలైట్ లింక్‌ని ఇన్‌స్టాలేషన్ చేసి, లాంచ్ (Antarctica To Shadnagar) చేసేందుకు ఉద్దేశించి రూ.110 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) టెండర్లను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన  బిడ్‌ల స్వీకరణ మే 26న ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగుస్తుంది. NRSC, ప్రతిపాదనలు సమర్పించడానికి ఆసక్తి ఉన్నసంస్థల మధ్య ప్రీ-బిడ్ సమావేశం మే 26న షాద్‌నగర్‌లోని దాని కార్యాలయంలో జరుగుతుంది.

షాద్‌నగర్ ఇస్రో  సెంటర్ కేంద్రంగా శాటిలైట్ ఇంటర్నెట్..

ISRO యొక్క షాద్‌నగర్ సెంటర్ లో కేఏ -బ్యాండ్ శాటిలైట్ లింక్‌ ఇన్‌స్టాలేషన్ పూర్తి అయితే.. ఇక్కడి నుంచి శాటిలైట్ ద్వారా అంటార్కిటికాలో ఉన్న మైత్రి, భారతి పరిశోధనా కేంద్రాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. రెండు సెంటర్ల మధ్య హైస్పీడ్ లో అధిక డేటా బదిలీకి మార్గం సగం అవుతుంది. షాద్‌నగర్ ఇస్రో  సెంటర్ కేంద్రంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే..  అంటార్కిటికాలో మన దేశ శాస్త్రవేత్తలు జరుపుతున్న రీసెర్చ్ లు స్పీడప్ అవుతాయి. అక్కడి నుంచి వేగంగా సమాచారాన్ని ఇండియాకు ట్రాన్స్ ఫర్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

  Last Updated: 20 May 2023, 11:08 AM IST