Site icon HashtagU Telugu

Pahalgam Terror Attack : మరో సంచలన వీడియోస్ బయటకు

Pahalgam Terror Attack Vide

Pahalgam Terror Attack Vide

జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack )కి సంబంధించి రెండు కొత్త వీడియోలు (New Videos) వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు కాల్పులు జరుగుతున్న సమయంలో తీసినవిగా తెలుస్తున్నాయి. వీడియోల్లో టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుండగా, ప్రాంతంలో ఉన్న టూరిస్టులు తీవ్ర భయంతో బిక్కుబిక్కుమంటూ దిక్కులేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. వారి ముఖంలో భయం, అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తుంది.

Box Office : నాని – సూర్య బిగ్ ఫైట్ ..మరి హిట్ కొట్టేది ఎవరో..?

వీడియోలలో మరో ఆసక్తికరమైన విషయం కనపడింది. కాల్పులు మొదలైనప్పటి నుండి టూరిస్టులు అనేక చోట్ల ఒక్కో చోట కూర్చుని, తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా కనిపిస్తున్నారు. పహల్గామ్ ప్రాంతంలోని దుకాణాల దగ్గర వేర్వేరు వర్గాల టూరిస్టులు చిన్న చిన్న గుంపులుగా కూర్చుని తీవ్ర భయంతో ఉండటం ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉగ్రదాడి తరువాత, పహల్గామ్ ప్రాంతంలో భద్రతా చర్యలను కఠినం చేయడానికి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. టెర్రరిస్టుల దాడి భయంతో టూరిస్టులు, స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ దాడి గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించి భద్రతా పరిస్థితులను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టారు.

Rajamouli : రాజమౌళి ఆలా హీరోయిన్ల బిస్కెట్లకు పడిపోతాడా..?

దాడికి ముందు ఈ ఉగ్రవాదుల బృందం సుమారు 22 గంటల పాటు అటవీ ప్రాంతంలో నడిచి, పహల్గామ్ లోయలోకి ప్రవేశించినట్లు విచారణలో వెల్లడైంది. ఉగ్రవాదులు ఏకే47 రైఫిళ్లు, ఎం4 కార్బైన్ వంటి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. దాడి అనంతరం ఘటనా స్థలం నుంచి ఉగ్రవాదులు రెండు మొబైల్ ఫోన్లను అపహరించుకుపోయినట్లు తెలిసింది. వీటిలో ఒకటి పర్యాటకుడికి చెందింది కాగా, మరొకటి స్థానికుడిదిగా గుర్తించారు. ఈ ఫోన్ల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది.