Sitakka : ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు మరో జత యూనిఫాం: మంత్రి సీతక్క

ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం-పచ్చదనం డ్రైవ్..

Published By: HashtagU Telugu Desk
Minister Seethakka

Minister Seethakka

Minister Sitakka : ప్రభుత్వ పాఠశాల(Government school) విద్యార్దులకు మరో జత యూనిఫాం(Uniform) లు సిద్దం చేసి పంపిణి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మంత్రి సీతక్క రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…స్వచ్చదనం, పచ్చదనం సక్సెస్ చేసిన అందరికి అభినందనలు చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహ‌ణ‌, ప‌చ్చద‌నం, స్వయం స‌హాయ‌క సంఘాల బ‌లోపేతంపై జిల్లా పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల‌తో మంగళవారం నాడు రాష్ట్ర స‌చివాల‌యం నుంచి మంత్రి సీత‌క్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల వ‌ర‌కు బాగా క‌ష్టప‌డ్డారని తెలిపారు. మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచిన సిబ్బందికి ఆగ‌స్టు 15వ తేదీన స‌న్మానిస్తామని చెప్పారు. గ‌తంలో పోలిస్తే ఎక్కువ ప‌ని జ‌రిగిందని.. కానీ మ‌రింత మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఉందని వివరించారు. మండ‌లాల వారిగా రివ్యూలు చేసి స‌మ‌గ్ర నివేదిక‌లు ఇవ్వాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో పోలిస్తే ఎక్కువ పని జరిగిందని… కాని మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం-పచ్చదనం డ్రైవ్ కొనసాగుతుందని… పాములతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. క్లీనింగ్ మీద దృష్టి సారించండి…పారిశుద్య లోపాలపై వార్తలు వస్తే సరిదిద్దండని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల వరకు అధికారులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని… జీపీ స్పెషల్ అధికారులు ఉదయం కనీసం మూడు గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యత్వాన్ని కోటి మందికి చేర్చాలి..మహిళా శక్తి ప్రోగ్రాంలో ఎస్సీ, ఎస్టీ మహిళల భాగస్వామ్యం పెంచాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చికున్ గున్యా వంటి విష జ్వరాల‌తో ఊర్లకు ఊర్లు మంచాన ప‌డ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితులు లేవని జ్వర సర్వేలు చేసి జ్వర నివార‌ణ‌కు చ‌ర్యలు చేప‌డుతున్నామని వివరించారు. అయినా త‌ప్పుడు వార్తలు రాస్తూ బ‌ద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. త‌ప్పుడు ప్రచారం చేస్తే అధికారుల వాస్తవాల‌ను ప్రజల‌కు తెలియ‌జేయాలని సూచించారు. లేకపోతే ప్రభుత్వ ప‌నిత‌రం స‌రిగా లేద‌నే సంకేతాలు వెళ్తాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Read Also: Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం

  Last Updated: 13 Aug 2024, 01:48 PM IST