కోల్కతా(Kolkata )లో మహిళ డాక్టర్స్ (Women Doctors) కు వేదింపులు అనేవి తగ్గడం లేదు..ఆ మధ్య ట్రేని మహిళ డాక్టర్ ను అతి దారుణంగా అత్యాచారం చేసి , చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా..దీనిపై ఇంకా డాక్టర్స్ యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ప్రభుత్వం , పోలీసులు చెపుతున్నప్పటికీ , మహిళ డాక్టర్స్ కు మాత్రం వేదింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రైడ్ రద్దు చేసినందుకు ఓ మహిళ డాక్టర్ ను ఓ బైక్ రైడర్ (Bike Rider) వేధింపులకు గురి చేసాడు.
నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తోన్న సదరు మహిళ.. విధులు పూర్తిచేసుకుని ఇంటికెళ్లేందుకు బైక్ రైడ్ బుక్ చేసింది. రైడర్ ఆలస్యంగా వస్తుండటంతో క్యాన్సిల్ చేసింది. దాంతో కోపంతో ఊగిపోయిన రైడర్ ఆమెను వేధించాడు. 17 కాల్స్, అసభ్య వీడియోలు పంపి.. నువ్వు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొంటావని హెచ్చరించాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. తొలుత ఆన్లైన్ లో పోలీస్ కమిషనరేట్ కు ఫిర్యాదు చేసిన ఆమె.. ఆ తర్వాత పుర్బా జాదవ్ పుర్ పీఎస్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also : Dangerous Medicines: 49 మందులను ప్రమాదకరంగా గుర్తించిన సీడీఎస్‌సీవో
