Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌..ఏడుగురు మావోల హతం

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 01:53 PM IST

Encounter: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని నారాయణ్‌పూర్‌ జిల్లా(Narayanpur District)ల సరిహద్దులో ఈరోజు మరోసారి మావోయిస్టులు(Maoists), భద్రతా సిబ్బంది(Security personnel)కి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మవోయిస్టులు హతమయ్యారు. అయితే మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందగా.. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టి.. మంగళవారం ఉదయం నక్సల్స్‌ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగుర్ని మట్టుబెట్టాయి. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరికొందరు నక్సల్స్‌ పరారయ్యారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Read Also:Ileana : బాలీవుడ్ రావడం వల్లే అవకాశాలు తగ్గాయంటున్న ఇలియానా..!

కాగా, ఇటీవల కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇక్కడ కాల్పుల్లో 29 మంది మరణించారు. వీరిలో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. తాజా ఘటనతో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్‌ అడవుల్లో మొత్తం 88 మంది నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది హతమార్చారు. కాగా, 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జగరడం ఇది రెండోవసారి.