Delhi Election Results : మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓటమిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి మంచి క్యారెక్టర్ ఉండాలని, మంచి ఆలోచనపరులనే ప్రజలు ఎన్నుకుంటారంటూ..కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటినుంచో ఎన్నికల విషయంపై కేజ్రీవాల్ ను హెచ్చరించినా, వాటిని పెడచెవిన పెట్టారని.. దాని ఫలితమే ఇదని అన్నా హజారే అన్నారు.
Read Also: Delhi Exit Polls : ‘ఎగ్జిట్ పోల్స్’ లెక్క తప్పింది.. ఢిల్లీలో కూలిన కేజ్రీ‘వాల్’
ఆప్ నేతలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లారు. ఇలాంటివి ఉండకూడదని చాలా కాలం నుంచి చెబుతున్నాను. ఆప్ నేతలు లిక్కర్ స్కామ్, అనివీతి ఆరోపణలలో చిక్కుకున్నారు. వాటి ఫలితంగా అతని (అరవింద్ కేజ్రీవాల్) ఇమేజ్ దెబ్బతింది. అందువల్లే ఆప్ నేతలకు, కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి మంచి వ్యక్తిత్వంతో పాటు, మంచి ఆలోచనలు ఉండాలని నేను భావిస్తాను. వ్యక్తికి సంబంధించిన క్లీన్ ఇమేజ్ ఉండాలి. లేకపోతే ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
అయితే తాను దోషిని కాదని కేజ్రీవాల్, ఆ పార్టీ నిరూపించుకోవాలి. నిజం ఎల్లప్పుడు ఒకటే ఉంటుంది. ఎప్పటికీ మారదు. కానీ తాము తప్పు చేయలేదని నిరూపించుకోవడంలో ఆప్ నేతలు సక్సెస్ కాలేదు. ఓ సమావేశం జరిగినప్పుడు, తాను పార్టీలో ఉండకూడదని డిసైడే బయటకు వచ్చేశా. ఆరోజు నుంచి ఆప్ కు దూరంగా ఉన్నానని సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరచుగా వ్యక్తిత్వం గురించి మాట్లాడతాడు. కానీ అతడే మద్యం పాలసీ కేసులో ఇరుక్కున్నాడని ప్రజలు గమనించారు. దాంతో రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు ఎన్నో ఆరోపణలు చేస్తాయి.
Read Also: Kejriwals Defeat : అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..