Site icon HashtagU Telugu

Anand Mahindra Tweet : ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..ధన్‌తేరస్‌లో బంగారం,వెండి కొనకండి…ఎందుకంటే..!!

Anand Imresizer

Anand Imresizer

ధన్‌తేరస్‌తో దీపావళి పండుగ ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రజలు ధన్‌తేరస్ సందర్భంగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. ధంతేరస్ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ధంతేరస్ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని..ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్మకం. అయితే ఇది నిజంగా జరుగుతుందా? ఈ విషయంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ధన్‌తేరస్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధన్ తేరస్ కు నిజమైన అర్ధాన్ని చెప్పారు. ‘మీ ఇంట్లో సంపదల వర్షం కురుస్తుంది, కష్టాలు నశిస్తాయి, మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది’ అన్నాడు. దీనితో పాటు ప్రజలకు చాలా పెద్ద సందేశం కూడా ఇచ్చారు. అసలు డబ్బు అంటే ఏమిటో ఒకసారి ఆలోచించండి అంటూ సూచించారు. తన ట్విట్టర్‌లో ఇలా రాశారు, ‘డబ్బు యొక్క నిజమైన అర్థం ఏమిటో మనం కూడా ఆలోచించాలి. బంగారం లేదా వెండి మాత్రమే కాదు, మనశ్శాంతి, అందరికీ సద్భావన, ఇతరులకు సేవ. ఇది నిజమైన బంగారం, వెండి. మీకు ధన్తేరస్ శుభాకాంక్షలు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై నెటిజన్లు స్పందించారు. ఆయన మాటలతో ఏకీభవించారు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.