Site icon HashtagU Telugu

Anand Mahindra: నువ్వు మామూలోడివి కాదు సామీ.. ఆనంద్ మహీంద్రాయే సెల్యూట్ కొట్టాడు

12

12

ఈ ఫోటోలో వ్యక్తిని చూస్తే.. వార్నీ.. ఏం బ్యాలెన్స్ చేస్తున్నాడ్రా భాయ్.. సైకిల్ హ్యాండిల్ వదిలేసి అలా ఎలా తొక్కగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అసలే వంకీలు తిరిగిన రోడ్డు. ఆపై నెత్తిన బరువైన బట్టల మూట. ఆ పొజిషన్ లో ఆ మూటను రెండు చేతులతో పట్టుకున్నాడు. అంటే సైకిల్ హ్యాండిల్ పట్టుకోవడానికి అవకాశమే లేదు. అయినా సరే.. తన శరీరంతోనే సైకిల్ ను బ్యాలెన్స్ చేస్తూ ఆ టూవీలర్ ని నడిపేశాడు.

ఇసుమంతైనా తొట్రుపాటు లేదు. ఏమాత్రం తడబాటు పడలేదు. భయం కాని, బెరుకు కాని మచ్చుకైనా కనిపించలేదు. ఎదురుగా ఉన్నదేమీ సాపుగా ఉన్న రోడ్డు కాదు. ఎక్కడిక్కకడ వంపులు తిరుగుతూ ఉంది. అయినా సరే.. బాడీని బ్యాలెన్స్ చేస్తూనే ఆ దోభీ… సైకిల్ ను తొక్కుకుంటూ వెళ్లాడు. ఆ సైకిల్ వెనకాలే కారులో వెళ్లిన మరో వ్యక్తి దీనిని వీడియో తీయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అయ్యింది.

ఈ వైరల్ వీడియో కాస్తా ఆనంద మహీంద్రా దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తన ట్విట్టర్ లో దీనిని పోస్ట్ చేశారు. ఆ ధోబీకి హ్యాట్సాఫ్ చెప్పారు. అసలంత పెద్ద మూటను తలపై పెట్టుకుని.. రెండు చేతులతో దానిని పట్టుకుని.. హ్యాండిల్ వదిలేసి.. సైకిల్ ను ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోయారు. ఒకవేళ అతడి శరీరంలో ఏమైనా గైరోస్కోప్ ఉందా అనుకున్నారు. గైరోస్కోప్ అంటే.. చక్రం లేదా డిస్క్ లాంటి ఒక పార్ట్.

ఈ పొజిషన్ లో సైకిల్ ని కంట్రోల్ చేయడమంటే మాటలు కాదు. కానీ ఇలాంటివాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు. దురదృష్టం కొద్దీ వారికి సరైన ట్రైనింగ్ లేక, గుర్తింపు లేక ఇలా మిగిలిపోతున్నారు. లేకపోతే జిమ్నాస్ట్ లు, క్రీడాకారులకు మనకేం కొదవ అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకే ఆయనను హ్యూమన్ సెగ్వే అని పొగిడాడు. సెగ్వే అనేది సెల్ఫ్ బ్యాలెన్స్ కలిగిన పర్సనల్ ట్రాన్స్ పోర్టర్. నిజమే.. ఈ సైకిల్ వాలా ఎవరో కాని.. కచ్చితంగా సెల్యూ్ట్ చేయాల్సిందే!