Amit Shah: రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష

Amit Shah: ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్‌ షా త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Published By: HashtagU Telugu Desk
Amit Shah's visit to Chhattisgarh

Amit Shah's visit to Chhattisgarh

Maoist Affected States: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటి కానున్నారు. సోమవారం అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. సీఎంలతోపాటు హోంమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు హాజరుకానున్నారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చలు జరగనున్నాయి.

Read Also: Gold Types : 18కే, 22కే, 24కే బంగారం రకాల్లో తేడా ఏమిటి ? క్యారట్ల వ్యాల్యూ ఎంత ?

ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్‌ షా త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా నిర్వహించే ఈ సమావేశానికి ఉభయ రాష్ట్రాల మంత్రులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

Read Also: IND vs BAN: నేడు బంగ్లాతో భార‌త్ తొలి టీ20.. దూబే లోటు క‌నిపించ‌నుందా..?

కాగా, రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. అబూజ్‌మడ్‌ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో తెలుగువారు ఉన్నట్లు సమాచారం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జోరీగ నాగరాజు ఎన్‌కౌంటర్‌ హతమైనట్లు తెలుస్తోంది. నాగరాజుకు మావోయిస్టు పార్టీలో పలురకాల పేర్లు ఉన్నాయి. నాగరాజును కమలేష్, రామకృష్ణ, ఆర్కే , విష్ణు అనే పేర్లతో పార్టీలోని కేడర్ పిలుస్తుంటారు. నాగరాజును పట్టుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది. రూ. 25 లక్షల రివార్డ్ ఉండటంతో నాగరాజు కేంద్ర కమిటీలో కూడా సభ్యుడు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు స్వస్థలం విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామం ఉంది. దండకారణ్యం పార్టీ వ్యవహారాల్లో నాగరాజుది కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Kiren Rijiju : బాబాసాహెబ్‌ను విస్మరించిన కాంగ్రెస్‌తో కలిసి ఉండవద్దు

 

 

  Last Updated: 06 Oct 2024, 12:55 PM IST