Free Download : ‘శ్రీరామ్‌ చరిత్‌ మానస్’‌కు ఆర్డర్ల వెల్లువ.. నేటి నుంచి ఫ్రీ డౌన్‌లోడ్

Free Download : ‘గీతా ప్రెస్’.. గాంధీ శాంతి బహుమతిని అందుకున్న సంస్థ ఇది.  గోరఖ్‌పూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘గీతా ప్రెస్’ మరోసారి చర్చల్లోకి వచ్చింది.

  • Written By:
  • Updated On - January 16, 2024 / 12:07 PM IST

Free Download : ‘గీతా ప్రెస్’.. గాంధీ శాంతి బహుమతిని అందుకున్న సంస్థ ఇది.  గోరఖ్‌పూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘గీతా ప్రెస్’ మరోసారి చర్చల్లోకి వచ్చింది. జనవరి 22న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ఈ ప్రెస్‌లో పబ్లిష్ అయ్యే ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే ఆ డిమాండుకు తగిన విధంగా ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలను గీతా ప్రెస్ ప్రింట్ చేయలేకపోయింది. ఈనేపథ్యంలో ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ చదవాలని అనుకునే వారి కోసం గీతా ప్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 15 రోజుల పాటు తమ వెబ్‌సైట్ నుంచి శ్రీరామ్‌చరిత్‌మానస్ పుస్తకాన్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.  తొలుత 15 రోజుల పాటు 50వేల మంది ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. డౌన్‌లోడ్స్‌కు వచ్చే స్పందన ఆధారంగా అవసరమైతే ఈ సంఖ్యను లక్షకు పెంచడంతో పాటు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇచ్చిన డెడ్‌లైన్‌ను కూడా పెంచుతామని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

అతి తక్కువ టైంలో దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షల ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ గ్రంథాల ప్రచురణ సామర్థ్యం తమకు లేదని గీతా ప్రెస్ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ప్రింటింగ్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని వివరించింది. 1923లో ఏర్పాటైన గీతా ప్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిషర్‌లలో ఒకటి. ఇది ఇప్పటివరకు 15 భాషలలో 95 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా స్టోర్లు ఉన్నాయి. 2022 సంవత్సరంలో గీతా ప్రెస్ ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ 75వేల కాపీలను ముద్రించి పంపిణీ చేసింది. అయితే అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ ప్రతిష్ట తేదీని ప్రకటించినప్పటి నుంచి ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ గ్రంథాల కోసం లక్షల్లో ఆర్డర్లు(Free Download) వస్తున్నాయి.

Also Read: Kim Jong Un : రాజ్యాంగం మార్చేయండి.. ‘నంబర్ 1 శత్రుదేశం’పై సవరణ చేర్చండి : కిమ్

పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు గీతాప్రెస్‌లో ‘రామచరితమానస’ పుస్తకం ప్రింటింగ్‌ను వేగవంతం చేస్తున్నారు. గీతా ప్రెస్ మేనేజర్ లాలమణి త్రిపాఠి మాట్లాడుతూ.. అయోధ్యలో నూతన రామమందిరం ‍ప్రారంభానికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి ‘సుందరాకాండ’, ‘హనుమాన్ చాలీసా’ ‘రామచరితమానస’కు డిమాండ్ మరింతగా పెరిగిందని అన్నారు. గతంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు సంబంధించి ప్రతి నెల దాదాపు 75 వేల కాపీలు ముద్రితమయ్యేవని, ఇప్పుడు దానిని లక్షకు పెంచినప్పటికీ, స్టాక్‌ ఉండటం లేదన్నారు. ‘రామచరితమానస’ పుస్తకం విషయానికొస్తే దీనిని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ విరివిగా ముద్రిస్తోంది. గడచిన 50 ఏళ్లలో తొలిసారిగా గీతా ప్రెస్‌లో ‘రామచరితమానస’ స్టాక్‌ తగినంతగా లేని పరిస్థితి ఏర్పడింది. రామచరితమానసకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, గీతా ప్రెస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.