Guinness World Records : 60 సెకన్లలో 10 విన్యాసాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆవు..

కుక్క‌లు, పిల్లులు, కుందేళ్లు, చిలుక‌లు, గినియా పందులు ఇలా ప‌లు ర‌కాల జంతువులు ప‌లు విన్యాసాల‌తో గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ కుటుంబంలో చోటు ద‌క్కించుకున్నాయి. అయితే, తొలిసారిగా ఓ ఆవు ఈ జంతువుల స‌ర‌స‌న చేసింది.

  • Written By:
  • Updated On - June 24, 2023 / 07:06 PM IST

అనేక ర‌కాల జంతువులు విన్యాసాలు చేస్తూ గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డు (Guinness World Records) బ‌ద్ద‌లు కొట్ట‌డం మ‌నం చూశాం. వీటిలో కుక్క‌లు, పిల్లులు, కుందేళ్లు, చిలుక‌లు, గినియా పందులుకూడా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ కుటుంబంలో భాగ‌మే. అయితే, తొలిసారిగా ఓ ఆవు (Cow) ఈ జంతువుల స‌ర‌స‌న చేసింది. అమెరికా (America) లోని నెబ్రాస్కాకు చెందిన మేగాన్ రీమాన్ (Megan Riemann) అనే మ‌హిళ ఘోస్ట్ అనే పేరు క‌లిగిన ఆవుకు ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో.. ఒక నిమిషంలో ఆవు ప‌ది విన్యాసాలు చేసి గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించింది. ప‌లు విన్యాసాల ద్వారా ఆవు గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డులో చేర‌డం ఇదే తొలిసారి కావ‌టం గ‌మ‌నార్హం.

ఘోస్ట్ అనే ఆవు త‌న యాజ‌మాని మేగాన్ రీమాన్ స‌హాయంతో విన్యాసాల‌ను ఒక నిమిషంలో పూర్తి చేసింది. ఆవు చేసిన విన్యాసాల‌తో కూడిన వీడియోను గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డు యాజ‌మాన్యం త‌మ యూట్యూబ్‌లో ఉంచింది. రికార్డు అనంత‌రం ఆవు యాజ‌మాని మేగాన్ మాట్లాడుతూ.. నేను ఆవును మొద‌టిసారి చూసిన క్ష‌ణం నుంచి ప్ర‌త్యేక‌మైన‌ద‌ని నాకు తెలుసు. అది ప్ర‌త్యేకంగా ఏదైనా చేసేలా చేయాల‌ని నేను నిర్ణ‌యించుకున్నాను.

మేగాన్ గుర్రాల‌కోసం ట్రిక్ – ట్రైనింగ్ కోర్సును బోధిస్తుంది. అయితే, ఆమె త‌న ఇష్ట‌మైన ఆవుకు ఈ ప‌ద్ద‌తుల‌ను నేర్పించాల‌ని నిర్ణ‌యించుకుంది. మొద‌ట‌ స్పిన్ ఎలా చేయాలో మేగాన్ త‌న ఆవుకు శిక్ష‌ణ ఇవ్వ‌డం కొన‌సాగించింది. క్ర‌మంగా త‌న శిక్ష‌ణ‌ను పెంచుకుంటూ పోయింది. అయితే, ఆవు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సంపాదించ‌గ‌ల‌ద‌ని మేగాన్ మ‌న‌సులోకూడా ఎప్పుడూ అనుకోలేదట‌. ఒక‌రోజు ఆమె జాయ్ ది పిగ్ గురించి తెలుసుకుంది. ఇది చూడ‌టానికి చాలా స‌ర‌దాగా ఉండ‌టంతో ప‌శువుల‌కు సంబంధించి ఏ రికార్డులు ఉన్నాయో చూడ‌టానికి మేగాన్ వెళ్లింది. ఎలాంటి రికార్డులు ప‌శువుల పేరుపైన లేవ‌ని తెలుసుకొని నేను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని మేగాన్ తెలిపింది. దీంతో ఆవుతో ఏదైనా కొత్త చేయాల‌ని అనుకుంది.

ఒక నిమిషంలో ఆవు ప్ర‌ద‌ర్శించిన అత్య‌ధిక ట్రిక్స్ కోసం కొత్త రికార్డును నెల‌కొల్ప‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌రువాత మేగాన్ ఆవును సిద్ధం చేయ‌డం మొద‌లు పెట్టింది. ఒక నిమిషంలో స‌రిపోయేంత త్వ‌ర‌గా చేయ‌గ‌లిగే ఉపాయాలు ఏమున్నాయ‌ని తెలుసుకుంది. వాటిని శ్ర‌ద్ద‌గా నేర్చుకున్న ఘోస్ట్ అనే ఆవు గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం