Vantara : 600 ఎకరాల్లో అంబానీల అడవి ‘వన్‌తార’.. విశేషాలివీ

Vantara : ‘వన్ తార’ పేరుతో సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​కు చెందిన రిలయన్స్​ ఫౌండేషన్  ప్రకటించింది.

  • Written By:
  • Updated On - February 26, 2024 / 03:49 PM IST

Vantara : ‘వన్ తార’ పేరుతో సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​కు చెందిన రిలయన్స్​ ఫౌండేషన్  ప్రకటించింది. దేశంలో కొవిడ్​ ప్రభావం తీవ్రంగా ఉన్న టైంలో తాము ఆలోచించేందుకు బాగా టైం మిగిలిందని.. ఆ సమయంలోనే దీని నిర్మాణాన్ని ప్రారంభించామని ముకేష్​ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వెల్లడించారు. వన్ తార అనేది ఒక కృత్రిమ అడవి అని చెప్పారు. గుజరాత్‌లోని జామ్​నగర్​లో ఉన్న రిలయన్స్​ రిఫైనరీ కాంప్లెక్స్​ ప్రాంతంలోని గ్రీన్ బెల్ట్​లో 600 ఎకరాల్లో ఈ అడవిని నిర్మించనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

భారతదేశం, విదేశాలలో గాయపడిన,  వేట కారణంగా బలహీనంగా మారిన జంతువులను రక్షించి తీసుకొచ్చి చికిత్స అందించేందుకు వన్ తారలో (Vantara) ఏర్పాట్లు ఉంటాయి. గుజరాత్‌లోని రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని గ్రీన్ బెల్ట్‌లో 3000 ఎకరాల్లో వన్ తార విస్తరించి  ఉంది. ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) వంటి సంస్థలతో కలిసి వన్ తారను రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించనుంది.  ఏనుగులు, ఖడ్గమృగం, చిరుతపులి, మొసళ్ల పరిరక్షణ, పునరావాసం పనుల కోసం వన్ తార కేంద్రం చొరవ చూపనుంది.  మెక్సికో, వెనిజులా మొదలైన దేశాలలో జరిగే అటవీ జంతువుల రెస్క్యూ మిషన్లలో కూడా వన్ తారా పాల్గొననుంది.

Also Read : Bathing Vs Peeing : స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తున్నారా ?

ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడంపై మేము దృష్టి సారించాము. ప్రపంచంలోని అగ్రశ్రేణి జూలాజికల్, జంతు వైద్య నిపుణులు కొందరు ఈ మిషన్‌లో చేరారు. వన్ తార ద్వారా భారతదేశంలోని 150కిపైగా జంతుప్రదర్శనశాలల వికాసానికి, వసతుల కల్పనకు కూడా చేయూత అందిస్తాం.  జూ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తాం’’ అని చెప్పారు. వన్ తారలో ఇప్పటికే ఏనుగుల కోసం ప్రత్యేక నిర్వహణ కేంద్రం ఉందన్నారు. సింహాలు, పులులు, మొసళ్ళు, చిరుతలు మొదలైన అనేక ఇతర జంతువుల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కూడా వన్ తారలో ఉన్నాయని తెలిపారు.

Also Read : Kalki 2898AD : 6000 సంవత్సరాల కథ కల్కి.. ప్రభాస్ కల్కి 2898AD కథని రివీల్ వచ్చేసిన దర్శకుడు..