Amazon Employees: అమెజాన్ హెచ్చరిక.. 2300 మంది ఉద్యోగులకు నోటీసులు!

దాదాపు 2 వేల 300 ఉద్యోగాలు కోత విధిస్తున్నట్లు అమెజాన్‌ (Amazon) నోటీసులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - January 19, 2023 / 02:44 PM IST

పలు టెక్ కంపెనీలు (Tech Companies), ఈకామర్స్ సంస్థలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. అమెజాన్ (Amazon) మరోసారి లేఆఫ్ లకు సిద్ధమైంది. 18 వేల ఉద్యోగాలు కోత విధించనున్నట్లు అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి మొదటి వారంలో దాదాపు 8 వేల మందికి కంపెనీ (Amazon) ఉద్వాసన పలికింది. తద్వారా తన శ్రామిక శక్తిలో 2 శాతం తగ్గించుకుంది.

2300 మందికి నోటీసులు

దాదాపు 2 వేల 300 ఉద్యోగాలు కోత విధిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులకు అమెజాన్‌ (Amazon) హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. అమెరికా, కెనడా, కోస్టారికా నుండి ఉద్యోగులను తగ్గించుకోవడానికి సిద్ధమైంది. ఈ పరిస్థితిల్లో ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ.. లింక్డ్ ఇన్ లో పంచుకుంటున్న వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గూగుల్ (Goole), డుంజో, షేర్ చాట్ కూడా లే ఆఫ్ ను ప్రకటించాయి. ఆర్థిక సంక్షోంభంతో భారత్ లో ఐటీ ఉద్యోగుల్లో ఒకింత భయం నెలకొంది. అయితే మరికొన్ని సంస్థలు ఉద్యోగులను బయటకు పంపించేందుకు సిద్ధమవుతున్నాయి.

10వేల మంది ఉద్యోగుల‌పై మైక్రోసాఫ్ట్ వేటు?

ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 1,600 మందికి పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ( IT Crisis Microsoft ) రోడ్డు ప‌డుతున్నారు. ప్రస్తుతం మాంద్యం భయాలు అల్లుకుంటోన్న వేళ‌ తొలగింపు వేగం పెరిగింది. గ‌త ఏడాది కంటే ఎక్కువ‌గా ఉద్యోగాలు(tech) ఊడిపోతున్నాయ‌ని Layoffs.fyi సైట్ షాకింగ్ నిజాల‌ను బ‌య‌ట పెట్టింది. గ‌త ఏడాది (2022)లో దాదాపు 1000 కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయ‌ని లెక్కించింది. ఇప్పుడు ఆ సంఖ్య మ‌రింత పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ 10వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌బోతుంద‌ని న్యూస్ వైర‌ల్ అవుతోంది. ఆ విష‌యాన్ని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. అయితే, కంపెనీ మాత్రం ధ్రువీక‌రించ‌డంలేదు.

Also Read: Aadhaar Camps: ఆధార్ అప్‌డేట్ కోసం ‘ఏపీ ప్రభుత్వం’ ప్రత్యేక క్యాంపులు!