Amazon Fine: నాణ్యత లేని కుక్కర్లు అమ్మిన అమెజాన్.. భారీ జరిమానా విధించిన కేంద్రం!

ప్రెషర్ కుక్కర్ ఈ పేరు మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప్రెషర్ కుక్కర్ కు

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 01:46 PM IST

ప్రెషర్ కుక్కర్ ఈ పేరు మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప్రెషర్ కుక్కర్ కు సంబంధించి పలు రకాల యాడ్స్ కూడా టీవీలో ప్రసారమవుతూ ఉంటాయి. అయితే తాజాగా నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను అమ్మినందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పై మండిపడింది. సదరు ప్రెషర్ కుక్కర్లు అన్నింటిని వెంటనే వినియోగదారుల నుంచి వెనక్కి తీసుకొని డబ్బులను తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ విషయం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను లక్ష రూపాయలు జరిమానా కూడా విధించింది.

అసలేం జరిగిందంటే.. అమెజాన్ లో ఆర్డర్ చేసిన ఓ ప్రెషర్ కుక్కర్ నాణ్యతకు సంబంధించి కొనుగోలుదారు వినియోగదారుల పోరాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన వినియోగదారుల ఫోరం ప్రెషర్ కుక్కర్ కు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అమెజాన్ ను కోరింది. ఆ వివరాలు అందిన తర్వాత పరిశీలన జరిపిన అధికారులు అవి నాణ్యత ప్రమాణాల మేరకు లేవని గుర్తించారు. అమెజాన్ ను పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించారు. అలా మెల్లమెల్లగా ఈ ఈ విషయం కేంద్ర వినియోగదారుల ఫోరానికి చేరింది. ఆధారాలను పరిశీలించి వాదనలను విన్న కేంద్రం ఫోరం తాజాగా ఈ తీర్పునిచ్చింది.

అయితే ఈ తరహా ప్రెషర్ కుక్కర్లను 2,265 మంది వినియోగదారులకు అమ్మినట్టు గుర్తించిన వినియోగదారుల ఫోరం వారందరికీ ఈ విషయంపై సమాచారం ఇవ్వాలని అమెజాన్ ను ఆదేశించింది. అలాగే సదరు వినియోగదారుల నుంచి నాసిరకం కుక్కర్ లను వెనక్కి తీసుకొని డబ్బులను రీఫండ్ చేయాలని సూచించింది.