Amazon Floating Store : అమెజాన్ మొట్టమొదటి తేలియాడే స్టోర్.. కాశ్మీర్ లో షురూ

Amazon Floating Store : దేశంలోనే మొట్టమొదటి తేలియాడే స్టోర్ ను అమెజాన్ లాంచ్ చేసింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో "ఐ హావ్ స్పేస్" పేరుతో ఈ  స్టోర్‌ ను ప్రారంభించింది.

Published By: HashtagU Telugu Desk
Amazon Floating Store

Amazon Floating Store

Amazon Floating Store : దేశంలోనే మొట్టమొదటి తేలియాడే స్టోర్ ను అమెజాన్ లాంచ్ చేసింది. 

శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో “ఐ హావ్ స్పేస్” పేరుతో ఈ  స్టోర్‌ ను ప్రారంభించింది.    

లోకల్ గా చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుకునే ముర్తజా ఖాన్ క్వాసీ.. ఇప్పుడు తన బోటుతో అమెజాన్ పార్సిల్స్ ను కస్టమర్లకు చేరవేస్తున్నాడు.    

అతడు తన “సెలెక్ బోట్” ద్వారా దాల్ లేక్, నైజీన్ సరస్సు పరిసర ప్రాంతాలలోని ఇళ్లకు అమెజాన్ డెలివరీలను అందిస్తున్నాడు.

Also read : Worlds Fastest Climbers : 92 రోజుల్లో 14 శిఖరాలు అధిరోహించారు.. 8,611 మీటర్ల జర్నీ సక్సెస్ 

“నేను అదనపు ఆదాయ అవకాశాల కోసం వెతకడం ప్రారంభించాను. ఈక్రమంలోనే Amazon యొక్క ‘ఐ హావ్ స్పేస్’ ప్రోగ్రామ్‌ను చూశాను. నాలాంటి లోకల్ స్టోర్ యజమానులు Amazon కస్టమర్‌లకు ప్యాకేజీలను చేరవేయడం ద్వారా ఆదాయాన్ని పొందేలా ఆ  ప్రోగ్రామ్‌ హెల్ప్ చేస్తుందని గుర్తించాను. నా బోటు(Amazon Floating Store)  ద్వారా అమెజాన్ పార్సిల్స్ ను కస్టమర్‌లకు డెలివరీ చేస్తున్నాను.  అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాను ” అని ముర్తజా ఖాన్ క్వాసీ చెప్పాడు. అమెజాన్ ‘ఐ హావ్ స్పేస్’ ప్రోగ్రామ్ 2015లో ప్రారంభమైంది. ఇందులో నమోదు చేసుకున్న స్టోర్‌ ల నిర్వాహకులు తమ షాపు నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అమెజాన్ కస్టమర్‌లకు ఉత్పత్తులను అందించవచ్చు. అమెజాన్ ‘ఐ హావ్ స్పేస్’ ప్రోగ్రామ్ లో మన దేశంలోని దాదాపు 420 పట్టణాలు, నగరాల్లో దాదాపు 28,000 మంది కిరాణా భాగస్వాములు ఉన్నారు.

Also read : World Hepatitis Day-2023 : “ఒక జీవితం.. ఒకే కాలేయం”.. అవగాహనతో హెపటైటిస్‌ ను జయిద్దాం!

  Last Updated: 28 Jul 2023, 11:08 AM IST