Pirarucu : మనిషి కంటే పెద్ద సైజు చేపకు పెనుగండం

పిరరుకు (Pirarucu)..ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపలలో ఒకటి.. ఈ ఫిష్ మనిషి కంటే పెద్ద సైజులో ఉంటుంది..  దీన్ని పట్టుకుంటే తీసుకెళ్లడానికి చిన్నపాటి బ్యాగులు సరిపోవు.. మంచినీటి తటాకాలలో గాలిని పీల్చుతూ పెరిగే ఈ బోన్ లెస్ చేపజాతి ఇప్పుడు పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. 

  • Written By:
  • Updated On - June 10, 2023 / 10:32 AM IST

పిరరుకు (Pirarucu)..

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపలలో ఒకటి.. 

ఈ ఫిష్ మనిషి కంటే పెద్ద సైజులో ఉంటుంది..  

దీన్ని పట్టుకుంటే తీసుకెళ్లడానికి చిన్నపాటి బ్యాగులు సరిపోవు..   

మంచినీటి తటాకాలలో గాలిని పీల్చుతూ పెరిగే ఈ బోన్ లెస్ చేపజాతి ఇప్పుడు పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. 

అమెజాన్ అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అవి చాలా పెద్దవి. ఈ  భారీ రెయిన్‌ ఫారెస్ట్ బ్రెజిల్, వెనిజులా, కొలంబియా, సురినామ్, పెరూ, ఈక్వెడార్, బొలీవియా, ఫ్రెంచ్ గయానా, గయానా వంటి తొమ్మిది దేశాలలో విస్తరించి ఉంది. ఈ అడవులలో ఉండే మంచినీటి తటాకాల్లోనే పిరరుకు చేప పెరుగుతుంది. ఈ చేప శాస్త్రీయ నామం “అరపైమా గిగాస్”. ఇది దాదాపు 3 మీటర్ల (10 అడుగులు) పొడవు, 220 కిలోల (485 పౌండ్లు) బరువు ఉంటుంది.  దీని శరీరంలో ముందు భాగం పొడవుగా, సన్నగా ఉంటుంది.. అయితే వెనుక భాగం ఫ్లాట్ గా ఉంటుంది. గుండ్రని తోకను కలిగి ఉంటుంది. ఈ చేప చర్మం, మాంసానికి మార్కెట్లో చాలా గిరాకీ ఉంది. పిరరుకు(Pirarucu) చేప చర్మంతో ఎంతో కాస్ట్లీ  బూట్లు, బ్యాగులు, పర్సులు తయారు చేస్తుంటారు.  బ్రెజిల్ దేశంలోని  రియో డీ జెనీరియో , కొలంబియా దేశంలోని  బొగోటా , పెరూ దేశంలోని  లిమాలో ఉన్న ప్రఖ్యాత రెస్టారెంట్‌ లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో పిరరుకు చేపల వంటకాలు ఫేమస్. అందుకే ఈ చేపలపై వేటగాళ్ల కన్ను పడింది. బ్రెజిల్, పెరూ, కొలంబియా దేశాల  సరిహద్దుల్లో ఉన్న అమెజాన్ అడవుల్లో ఈ చేప కోసం వేటగాళ్లు నిత్యం హంటింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో వేటగాళ్లు తమను అడ్డుకునేందుకు ట్రై చేసే వాళ్ళను చంపేందుకూ వెనుకాడటం లేదు.

Also read : Fish Medicine: చేప ప్రసాదం పంపిణీ షురూ.. భారీగా తరలివచ్చిన జనం!

ఇద్దరిని దారుణంగా హత్య చేసిన వేటగాళ్లు..  

గత సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కార్యకర్త డిఫెండర్ బ్రూనో పెరీరా, బ్రిటీష్ జర్నలిస్ట్ డోమ్ ఫిలిప్స్ లను పిరరుకు చేపల వేటగాళ్లు దారుణంగా హత్య చేశారు.  బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాల్లోని ప్రఖ్యాత రెస్టారెంట్‌ లు, ఫైవ్ స్టార్ హోటళ్లకు అక్రమంగా పిరరుకు చేపలను సప్లై చేసేందుకు వేటగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లో జవారి లోయ ప్రాంతం ఉంది. ఇందులో నివసించే 8 తెగల వాళ్లకు మాత్రమే ఇళ్లలో ఆహార అవసరాలకు పిరరుకు చేపలను వేటాడే హక్కు ఉంది. కానీ ఇతర ప్రాంతాల నుంచి ఎంతోమంది వేటగాళ్లు అక్కడికి వెళ్లి ఆ చేపలు వేటాడుతున్నారు. పిరరుకు  చేప శ్వాస పీల్చుకోవడానికి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీటి ఉపరితలం మీదికి వస్తుంది. ఇదే అదునుగా వలలు, హార్పూన్‌లతో వేటగాళ్లు దాన్ని పట్టుకుంటున్నారు.