Site icon HashtagU Telugu

Amarnath Yatra: ఆధ్యాత్మిక కొండల్లో మరణ ఘోష!

Amarnath

Amarnath

అమర్ నాథ్.. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఈ దైవ భూమిని స్మరించుకోవడానికి ఎంతోమంది భక్తులు క్యూ కడుతుంటారు. అలాంటి దైవ భూమిపై పక్రుతి కన్నెర చేసింది. భారీ వరదల కారణంగా 15 మంది చనిపోవడంతో పాటు దాదాపు 40 మంది గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ అమర్‌నాథ్ గుహ మందిరంలో శనివారం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల నుండి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

NDRF, SDRF, BSF, CRPF, ఆర్మీ, పోలీసు ITBP బృందాలు శనివారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించాయని అధికారులు తెలిపారు. శుక్రవారం నాటి వరదల కారణంగా 15 మంది మరణించారని, 40 మందికి పైగా గాయపడ్డారని గందర్‌బాల్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO), అఫ్రోజా షా విలేకరులతో చెప్పారు. వరదల్లో చిక్కుకున్న ఐదుగురిని సజీవంగా రక్షించినట్లు తెలిపారు. గల్లంతైనవాళ్ల కోసం ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్లలో భాగంగా యాత్రికులను రక్షించడానికి హెలికాప్టర్లు సైతం రంగంలోకి దిగాయి. బాల్టాల్-హోలీ గుహ మార్గంలో భారీవర్షం కురిసే అవకాశం ఉందనీ, దీని వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Exit mobile version