Allu Arjun Is Best Actor : పార్టీ లేదా పుష్ప..?

ఇప్పుడు యావత్ సౌత్ ఇండస్ట్రీ అంత అల్లు అర్జున్ ను అడుగుతున్న మాట. గురువారం (ఆగస్టు 24) కేంద్ర ప్రభుత్వం 2021 కి గాను జాతీయ అవార్డ్స్ (National Film Awards 2021)ను ప్రకటించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి బెస్ట్ హీరో (Allu Arjun became the first Telugu star) గా అవార్డు దక్కింది. అది ఎవరికీ దక్కిందో చెప్పాల్సిన పనిలేదు. పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదెలా..అంటూ సినిమాలో అనడమే […]

Published By: HashtagU Telugu Desk
National Film Awards 2023

National Film Awards 2023

ఇప్పుడు యావత్ సౌత్ ఇండస్ట్రీ అంత అల్లు అర్జున్ ను అడుగుతున్న మాట. గురువారం (ఆగస్టు 24) కేంద్ర ప్రభుత్వం 2021 కి గాను జాతీయ అవార్డ్స్ (National Film Awards 2021)ను ప్రకటించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి బెస్ట్ హీరో (Allu Arjun became the first Telugu star) గా అవార్డు దక్కింది. అది ఎవరికీ దక్కిందో చెప్పాల్సిన పనిలేదు. పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదెలా..అంటూ సినిమాలో అనడమే కాదు జాతీయ అవార్డ్స్ లలో తగ్గేదేలే అనిపించుకున్నాడు అల్లు అర్జున్. ఉత్తమ జాతీయ నటుడి గా పుష్ప (Pushpa) చిత్రానికి గాను అల్లు అర్జున్ అవార్డు దక్కించుకున్నాడు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు పది కేటగిరిలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి.

బెస్ట్ తెలుగు ఫిల్మ్ విభాగంలో ఉప్పెన (Uppena)కు అవార్డు వరించింది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్, బెస్ట్ కొరియాగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మెయిల్ సింగర్, బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ జాతీయ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్ (Kondapolam)కు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ (Pushpa), బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ (RRR) కు గానూ కీరవాణికి జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ఆర్ఆర్ఆర్ కి అవార్డు వచ్చింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమాచార్యులకు నేషనల్ అవార్డు దక్కింది. ఇలా మొత్తంగా 10 జాతీయ అవార్డులు మన తెలుగు సినిమాలకు దక్కాయి. ఈసారి నార్త్ సినిమాలతో పోలిస్తే తెలుగు చిత్రాలకే అత్యధిక అవార్డులు రావడం విశేషం.

Read Also : Allu Arjun : 69 ఏళ్ళకి మొట్టమొదటి సారి తెలుగు వాళ్ళకి నేషనల్ బెస్ట్ యాక్టర్.. పుష్పరాజ్ తగ్గేదేలే..

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) కు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం..అది కూడా 69 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైం తెలుగు హీరోకు రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కు అవార్డు వచ్చిన విషయం తెలిసి చిత్రసీమ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. బన్నీ ఇంటి వద్ద పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పుష్ప టీం తో పాటు ఉప్పెన టీం సైతం అల్లు అర్జున్ ఇంటి వద్దే ఉన్నారు. సినీ పెద్దలంతా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

  Last Updated: 24 Aug 2023, 07:43 PM IST