Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ధనవంతులు విడాకులు తీసుకొని విడిపోవడం అన్నది కామన్ గా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 07:45 AM IST

ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ధనవంతులు విడాకులు తీసుకొని విడిపోవడం అన్నది కామన్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మనస్పర్ధలకే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఒక విడాకులు తీసుకొని విడిపోతున్న సమయంలో భార్యకు బాగా డబ్బు ఉన్నవారు అయితే కోట్ల సంపాదన భరణంగా చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి ఘటన ఎన్నో చోటు చేసుకునే విషయం తెలిసిందే. ఇలాంటివి ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఒక ఫ్యామిలీకి కోర్టు ఒక విభిన్నమైన తీర్పుని ఇచ్చింది.

భర్తకు భార్య నెల నెలా రూ.25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే. పూణేకు చెందిన ఓ 83 ఏళ్ల వృద్ధుడు తన 78 ఏళ్ల భార్య తనను విపరీతంగా వేధిస్తోందని విడాకులతో పాటుగా భరణం కూడా ఇప్పించాలని కోరుతూ 2019లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తమ వివాహమై 55 ఏళ్లు అయిందని, ఇన్నేళ్లుగా కూడా తాను ఇబ్బంది పడుతూనే ఉన్నానని విన్నవించారు ఆ వృద్ధుడు. ఈ విషయంపై కోర్టు విచారణ జరిపి తాజాగా తీర్పు ఇచ్చింది. ఆ ముసలి దంపతులకు విడాకులు మంజూరు చేసింది.

అయితే తప్పు ఎవరి వైపు ఉన్నా తప్పేనని సంపాదన, విడాకుల విషయంలో స్త్రీ,పురుష భేదం చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార్య ప్రతినెలా రూ.25 వేల చొప్పున భర్తకు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది. కాగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం భార్యా భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు విడాకులు మంజూరు చేయవచ్చు. అందులో భార్యకు ఆదాయం ఉండి భర్తకు ఎలాంటి ఆదాయ మార్గం లేనప్పుడు సదరు భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చు. భార్యలే కాదు బాధిత భర్తలు కూడా సమాన న్యాయాన్ని పొందవచ్చని ఈ కేసులో కోర్టు తీర్పు స్పష్టం చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వైశాలి చండే తెలిపారు.