LPG Cylinder – Biometric : వంటగ్యాస్ కనెక్షన్ ‘బయోమెట్రిక్ అప్‌డేట్’ ఇక ఈజీ

LPG Cylinder - Biometric : వంటగ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి ప్రస్తుతం ఎంతో కొంత సబ్సిడీ అమౌంట్ బ్యాంకు అకౌంట్లో జమవుతోంది.

Published By: HashtagU Telugu Desk
LPG Cylinders

14 Kg Lpg Gas Cylinder Price Today

LPG Cylinder – Biometric : వంటగ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి ప్రస్తుతం ఎంతో కొంత సబ్సిడీ అమౌంట్ బ్యాంకు అకౌంట్లో జమవుతోంది. ఒకవేళ భవిష్యత్తులోనూ ఆ సబ్సిడీని పొందాలంటే డిసెంబర్ 31లోగా  బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఇందుకోసం తొలుత గ్యాస్ వినియోగదారులంతా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీశారు. ఈనేపథ్యంలో ప్రజల సౌకర్యార్ధం ఇప్పుడు బయోమెట్రిక్ అప్ డేట్ పద్ధతిని సులభతరం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

గ్యాస్ డెలివరీ చేసేవారే కస్టమర్ల నుంచి బయోమెట్రిక్‌ను  అప్‌డేట్ చేయనున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్ మొబైల్‌లో ప్రత్యేక యాప్‌ ఉంటుంది. దీని ద్వారా మీ ఇంటివద్దే కస్టమర్ వేలిముద్ర, ముఖం స్కాన్ చేసి బయోమెట్రిక్‌ అప్‌డేట్ చేస్తారు. ఒకవేళ డిసెంబరు 31లోగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోకపోతే.. ఆ కస్టమర్లకు వంటగ్యాస్ సబ్సిడీని కట్ చేస్తారు. కొత్త సంవత్సరం 2024 నుంచి ఇది అమలు చేస్తారు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం.. ప్రతీ కుటుంబానికి ఏటా గరిష్టంగా 12 సిలిండర్లకు సబ్సిడీ ప్రయోజనం లభిస్తుంది. అయితే కస్టమర్లు ముందుగా మొత్తం డబ్బు పేమెంట్ చేసి సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత కస్టమర్ అకౌంట్‌లో సబ్సిడీ డబ్బు(LPG Cylinder – Biometric) జమ అవుతుంది.

Also Read: APAAR Card : ‘అపార్’ కార్డు గురించి తెలుసా ? ఇవీ ప్రయోజనాలు

తెలంగాణలో రేషన్‌ కార్డులపై పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను మెరుగుపరుస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వంద రోజుల్లోగా వీటిని అమలుచేస్తామని స్పష్టంచేశారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 3-4 వేల కోట్ల భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

  Last Updated: 13 Dec 2023, 01:22 PM IST