Site icon HashtagU Telugu

Akira Nandan: వాహ్..అకీరా..RRRపాటను ఇరగదీశావ్ .!!

Akira Nandan

Akira Nandan

RRRఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మూవీపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీప్రముఖులంతా ప్రశంసలు కురిపించారు. పాన్ ఇండియా మూవీగా RRRమూవీ అన్ని భాషాల్లో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ OTTలో అదరగొడుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఇంకో వార్త హల్ చేస్తోంది. RRRపాటకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీర నందన్ అదిరిపోయే ఫర్మామెన్స్ ఇచ్చాడు.

అకీరనందన్ సోమవారం తన స్కూల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ ఈవెంట్ కు రేణుదేశాయ్ తోపాటు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫోటో పెద్దెత్తున వైరల్ అయ్యింది. ఇఫ్పుడు ఆదే ఈవెంట్ లో అకీరా RRRమూవీలోని దోస్తీ సాంగ్ ని పియానో పై వాయించి తన టాలెంట్ ను బయటపెట్టాడు. దీంతో ఈ వీడియో ఇఫ్పుడు పవన్ ప్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ విష్ చేస్తున్నారు.

మహేశ్ బాబు పాటను పియానోపై వాయించాడు అకీరా. సర్కారు వారి పాట మూవీలో కళావతి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఈ సాంగ్ ను అకీరా పియానోపై వాయించి అందర్నీ మెస్మరైజ్ చేశాడు. ఈ వీడియోను తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు.