Site icon HashtagU Telugu

Air India : 60 విమనాలు రద్దు చేసిన ఎయిరిండియా..!

Air India

Air India

Flight Services Cancelled : ఎయిరిండియా అమెరికాకు 60 విమాన సర్వీసుల్నీ రద్దు చేసింది. అయితే నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్‌ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్‌ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈ మేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.

ఇకపోతే.. ఎయిర్ ఇండియా నవంబర్ 15 మరియు డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, నెవార్క్ మరియు న్యూయార్క్ నుండి 60 విమానాలను రద్దు చేసింది, ఎందుకంటే ఈ గమ్యస్థానాలకు కొన్ని విమానాలను నడపడానికి తగిన వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ లేదు. అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా ఢిల్లీ-చికాగో రూట్‌లో 14 విమానాలు, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్‌లో 28 విమానాలు, ఢిల్లీ-ఎస్‌ఎఫ్‌వో మధ్య 12 విమానాలు, ముంబయి-న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ-నెవార్క్ మార్గంలో రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. ఎయిర్ ఇండియా వెయింటనెన్స్ కోసం పంపబడుతున్న ఎంఆర్ఓ ఆపరేటర్ నుంచి విమానాలు అందడంతో ఆలస్యం జరిగింది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని వైడ్ బాడీ విమానాలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా కొరత ఏర్పడింది. ఏయిర్ ఇండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు పూర్తి రీఫండ్‌ని ఆఫర్ చేస్తోంది.

Read Also: CM Chandrababu : రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు