AIMIM: బీహార్‌లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత

  MIM Leader Shot Dead:  : బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్‌ను కూడా కాల్చి […]

Published By: HashtagU Telugu Desk
Aimim State Secretary Abdul Salam Alias Aslam Mukhiya Shot Dead In Gopalganj

Aimim State Secretary Abdul Salam Alias Aslam Mukhiya Shot Dead In Gopalganj

 

MIM Leader Shot Dead:  : బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్‌ను కూడా కాల్చి చంపారని(Shot Dead) అసద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌( cm Nitish Kumar) పై నిప్పులు చెరిగారు. ‘‘కుర్చీ కోసం జరిగిన పోటీలో మీరు మీ కుర్చీని కాపాడుకున్నారుగా, ఇప్పటికైనా కొంత పనిచేయండి. మా నాయకులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుందా?” అని ఒవైసీ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

read also : ‘Mission Medigadda’ : బ్యారేజీ కథ ఏంటో చూసేందుకు బయలుదేరిన నేతలు

  Last Updated: 13 Feb 2024, 11:38 AM IST